రాష్ట్రీయం

సిమెంటు కల్వర్టులపై సాగు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గండేపల్లి, జూలై 26: పోలవరం ఎడమ కాలువ నిర్మాణంలో భాగంగా భూములు కోల్పోయిన రైతులు ప్రస్తుతం ఆ కాలువపై నిర్మించిన కల్వర్టులపై వరి సాగు చేపడుతున్నారు. తూర్పు గోదావరి జిల్లా గండేపల్లి మండలం మురారి గ్రామం వద్ద నిర్మించిన రెండు కల్వర్టులపై రైతులు ఈ సాగు ప్రయోగం చేపట్టారు. వర్షపు నీటితో కొట్టుకువచ్చిన మట్టి, నీరుకు అడ్డుకట్టలు వేసి నిల్వచేసి, అందులో సాగు ప్రారంభించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తమ భూములను పోలవరం కాలువ కోసం తీసుకున్నారని, అప్పట్లో అందించిన అంతమాత్రపు పరిహారం తమను రోడ్డుపాల్జేసిందని మురారి గ్రామానికి చెందిన రైతులు గంగరాజు, సత్యనారాయణ వాపోయారు. పోలవరం కాలువ నిర్మాణంలో ఉన్న భూములు సర్వం కోల్పోయామని, ఇచ్చిన పరిహారం అయిపోయిందని, ఇక తప్పనిసరి పరిస్థితుల్లో జీవనోపాధి కోసం ఖాళీగా ఉన్న కల్వర్టులపై ప్రయోగాత్మకంగా వరినాట్లు వేసుకుంటున్నామన్నారు. వర్షపు నీటితో కొట్టుకు వచ్చిన నీటిని నిల్వ చేసుకుని వరినాట్లు వేసుకుంటున్నామని వారు వివరించారు. అయితే పూర్తిగా పంట చేతికందే వరకు అనుమానమేనని, ధైర్యంగా పెట్టుబడి పెట్టి కల్వర్టులపై వరి సాగుకు ఉపక్రమించామన్నారు.

విద్యాసంస్థల బంద్ విజయవంతం

ఎబివిపి పిలుపుతో స్వచ్ఛందంగా మూసివేత

ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జూలై 26 : తెలంగాణ రాష్ట్రంలోని విద్యాసంస్థల్లో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మంగళవారం జరిగిన రాష్ట్ర వ్యాప్త బంద్ విజయవంతం అయిందని ఎబివిపి రాష్ట్ర శాఖ ప్రకటించింది. ప్రైవేట్ కాలేజీలు, కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఫీజుల నియంత్రణకు చట్టం తేవాలని, టిఎస్‌ఎంసెట్-2 పరీక్షాపత్రం లీకేజీ ఘటనపై దర్యాప్తు చేయించి, నేరస్థులను శిక్షించాలని, ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల్లో ‘బి’ క్యాటగిరీ సీట్లను ప్రభుత్వమే ఆన్‌లైన్ ద్వారా భర్తీ చేయాలని, విద్యార్థి వసతిగృహాల్లో స్కాలర్‌షిప్‌లను మూడు రెట్లు పెంచాలని, ఖాళీగా ఉన్న బోధనా సిబ్బంది పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నట్టు ఎబివిపి రాష్ట్ర కార్యదర్శి అయ్యప్ప స్పష్టం చేశారు. బంద్ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా 1200 మంది విద్యార్థినాయకులను అరెస్ట్ చేయడాన్ని అయ్యప్ప ఖండించారు.

బాలికపై అత్యాచారం

యువకుడిని చితకబాది పోలీసులకు అప్పగించిన గ్రామస్థులు
సారంగాపూర్, జూలై 26: కరీంనగర్ జిల్లా జగిత్యాల సారంగాపూర్ మండలంలోని పెంబట్ల గ్రామానికి చెందిన ఐదవ తరగతి బాలిక(10)పై అదే గ్రామానికి చెందిన 22 ఏళ్ల యువకుడు అత్యాచారం చేసిన సంఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది. ఎస్సై కృష్ణస్వామి కథనం ప్రకారం... ఐదవ తరగతి చదువుతున్న బాలికపై పక్కింట్లో నివసిస్తున్న పొట్టవత్తిని రవి (22) అనే యువకుడు చాకెట్లు ఇస్తానని ఆశ చూపి తన ఇంట్లోకి పిలిచి అసభ్యంగా ప్రవర్తించాడు. ఏమీకాదంటూనే బాలికను వివస్తన్రు చేసి బలవంతంగా అత్యాచారం చేయడంతో పాటు ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. గత పది రోజులుగా బాలికకు కడుపు నొప్పి వస్తుండడంతో తల్లి స్థానిక వైద్యునికి చూపించగా, తగ్గకపోవడంతో ఈనెల 25న జగిత్యాల పట్టణంలోని వైద్యురాలికి చూపించింది. బాలికపై అత్యాచారం జరిగిందని, వైద్యురాలు గుర్తించడంతో సమీప బంధువులు, గ్రామస్థులతో స్థానిక పోలీసు స్టేషన్‌కు వెళ్లి తల్లి ఫిర్యాదు చేసినట్లు ఎస్సై కృష్ణస్వామి తెలిపారు. కాగా, ఆగ్రహించిన గ్రామస్థులు యువకుడిని పట్టుకుని చితకబాది పోలీసులకు అప్పగించారు. యువకుడిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై కృష్ణస్వామి తెలిపారు.

యువకుడిని కఠినంగా శిక్షించాలని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేసారు.