తెలంగాణ

జలపాతాలు ఇక టూరిజం కేంద్రాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 26: తెలంగాణలో టూరిజం అభివృద్ధి కోసం కృషి చేస్తున్నట్టు తెలంగాణ టూరిజం శాఖ మంత్రి చందూలాల్ తెలిపారు. టూరిజం ప్లాజాలో మంగళవారం టూరిజం అభివృద్ధిపై చందూలాల్ సమీక్ష జరిపారు. స్వదేశీ దర్శన్‌లో భాగంగా ట్రైబల్ సర్క్యూట్‌ను అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం మొదటి విడతలో 17 కోట్లను మంజూరు చేసిందని ఈ నిధులతో ములుగు గట్టమ్మ దేవాలయం, లక్నవరం, మేడారం, తాడ్వాయి, దావరవాయి, మల్లూరు, బొగత జలపాతాలను అభివృద్ధి చేయనున్నట్టు మంత్రి తెలిపారు. కేంద్ర సహకారంతో చేపట్టిన ఎకో టూరిజం ప్రాజెక్టు పనులు సోమశిల, సింగోటం, కొల్లాపూర్, శ్రీశైలం, అక్క మహాదేవి గుహలు, పరహాబాద్, మల్లెల తీర్థంలో వేగంగా పనులు జరుగుతున్నాయన్నారు. ఈ పనులన్నింటినీ మరో రెండేళ్లలో పూర్తి చేస్తామని మంత్రి తెలిపారు. వచ్చే ఏడాదిలో బౌద్ధ సర్క్యూట్‌లో భాగంగా కోటి లింగాల, ధూళికట్ట, కొండాపూర్, తిరుమలగిరి, ఫణిగిరి, కోరుకొండ, నేలకొండపల్లి, నాగార్జునకొండ ప్రాంతాలను రెండువందల కోట్లతో అభివృద్ధి చేయబోతున్నట్టు చెప్పారు. పుణ్య క్షేత్రాల్లో ఉన్న టూరిజం హోటళ్లలో బస చేసే వారికి దైవ దర్శనం కల్పించే బాధ్యతను పర్యాటక సంస్థ చేయనున్నట్టు మంత్రి తెలిపారు.