తెలంగాణ

మూసీ నిండుగా.. డిండి అడుగంటగా..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, జూలై 28: జంటనగరాల్లో కురిసిన భారీ వర్షాలతో నల్లగొండ జిల్లాలోని కేతేపల్లి మూసీ ప్రాజెక్టులో నీటిమట్టం పెరిగి జలకళతో కనువిందు చేస్తోంది. ఇదే సమయంలో డిండి ప్రాజెక్టుకు జిల్లా పరిధిలో సరైన వర్షాలు లేక ఎలాంటి వరద నీటి ప్రవాహం చేరకపోవడంతో అడుగంటి నెర్రెలు బారి పూర్తిగా ఎండిపోయి కనిపిస్తోంది. మూసీ ప్రాజెక్టు నీటినిల్వ సామర్ధ్యం 645 అడుగులుకాగా ప్రస్తుతం 628 అడుగులకు చేరింది. డిండి ప్రాజెక్టులో 1.5 టిఎంసి నిల్వ సామర్ధ్యం ఉన్నా చుక్క నీరు లేదు. నాగార్జునసాగర్ ప్రస్తుతం డెడ్ స్టోరేజీలోనే కొనసాగుతుండగా గురువారం రాత్రికల్లా 503.40 అడుగులు, 120.70 టిఎంసిల నీటిమట్టంతో ఉంది. సాగర్ ఎగువన వర్షాలలతో సాగర్‌కు 635 క్యూసెక్కులు ఇన్‌ఫ్లోగా చేరుతోంది.