తెలంగాణ

పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు మలిదశలో భూసేకరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 29: పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు భూ సేకరణ త్వరలోనే పూర్తవుతుందని, ప్రస్తుతం ఇది చివరి దశకు చేరుకుందని అధికారులు వెల్లడించారు. 12 లక్షల ఎకరాలకు నీటిని అందించే ఈ ప్రాజెక్టును 30 నెలల్లో పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రాజెక్టు పనులపై నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు శుక్రవారం రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ నుంచి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, వివిధ జిల్లాల్లో భూ సేకరణపై చర్చించారు. భీమా, నెట్టెంపాడు, కోయిల్ సాగర్, కల్వకుర్తి ప్రాజెక్టులకు అక్కడక్కడా పెండింగ్‌లో ఉన్న భూ సేకరణ పనులు వెంటనే పూర్తి చేయాలని, వీలైతే ప్రత్యేక బృందాలతో స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ శ్రీదేవిని మంత్రులు ఆదేశించారు. పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు కోసం 26,500 ఎకరాల భూమి సేకరించామని, ఇప్పటి వరకు 13 వేల ఎకరాల భూములు ఇచ్చేందుకు 5,256 మంది రైతులు అంగీకరించారని శ్రీదేవి తెలిపారు. జిల్లాలోని 18 ప్యాకేజీల్లోనూ భూ సేకరణ పనులు ముమ్మరం చేసి ఈ ప్రాజెక్టు నిర్మాణానికి తోడ్పడాలని మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. ఈ ప్రాజెక్టులో ముంపుకు గురయ్యే భూమిలో 4,097 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. దీనిలో 3,965 ఎకరాలు ఇప్పటికే సేకరించినట్టు కలెక్టర్ తెలిపారు.
నల్లగొండ జిల్లాలో డిండి ప్రాజెక్టు భూ సేకరణ పురోగతిని మంత్రులు సమీక్షించారు. ఈ ప్రాజెక్టు భూ సేకరణకు పెండింగ్‌లో ఉన్న 50 కోట్ల రూపాయలు వెంటనే విడుదల చేసేందుకు చర్యలు తీసుకుంటామని హరీశ్‌రావు తెలిపారు. పెండ్లి పాకల, మోత్యాతండా ముంపు బాధితుల సమస్యలు పరిష్కరించాలని నల్లగొండ కలెక్టర్‌ను కోరారు. నాగార్జున సాగర్ టేల్ పాండ్‌ను ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణ అధికారులు కూడా ఉమ్మడిగా తనిఖీ చేయాలన్న ప్రతిపాదనను హరీశ్‌రావు అంగీకరించారు.
డిండి ప్రాజెక్టు భూ సేకరణ కోసం స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కార్యాలయం ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. జిల్లాల్లో పెండింగ్‌లో ఉన్న భూ సేకరణ పనులు వెంటనే పూర్తి చేయాలని చెప్పారు. వీడియో కాన్ఫరెన్స్‌లో నీటిపారుదల శాఖ సెక్రటరీ వికాస్ రాజ్, ఇంజనీర్ ఇన్ చీఫ్ సి.మురళీధర్‌రావు, విజయప్రకాశ్, నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల కలెక్టర్లు సత్యనారాయణ, శ్రీదేవి పాల్గొన్నారు.

పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టుపై అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్న మంత్రులు టి హరీశ్‌రావు, జూపల్లి కృష్ణారావు