తెలంగాణ

కదం తొక్కండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 30: ‘ఎవరిష్టం వచ్చినట్లు వాళ్లు ఆందోళన చేస్తామంటే ఎలా? అంతా కలసి సమష్టి నిర్ణయంతో పోరాటాలు చేయండి. మల్లన్నసాగర్‌కు ఏపిలో భూసేకరణకు తెరాస పోల్చడమేమిటి? ఏపిలోరైతులను భాగస్వాములను చేస్తున్నాం. అదే విషయం మీరు ప్రచారం చేయండి. రెండు తెలుగు రాష్ట్రాలను బిజెపి మభ్య పెడుతోంది. అవసరమైతే రెండు రాష్ట్రాలు కలసి హక్కుల కోసం పోరాడతాం’ అని ఏపి ముఖ్యమంత్రి, తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు తెలంగాణ తెదేపా నేతలనుద్దేశించి వ్యాఖ్యానించారు. శనివారం విజయవాడలో టిటిడిపి నేతలతో బాబు భేటీ అయ్యారు. ఆదివారం ఆయన ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన పార్టీ ఎంపీలతో భేటీ కానున్నారు.
పార్టీ అధ్యక్షుడు ఎల్.రమణ, ఎంపి గరికపాటి మోహన్‌రావు, రావుల చంద్రశేఖరరెడ్డి, ముద్దగోని అరవిందకుమార్‌గౌడ్, ఇనగాల పెద్దిరెడ్డి, నర్శిరెడ్డి వంటి సీనియర్లతో బాబు వివిధ అంశాలపై చాలాసేపు చర్చించారు. వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి సమావేశానికి హాజరుకాలేదు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. మల్లన్నసాగర్‌పై పార్టీ చేస్తున్న ఆందోళన ఏకపక్షంగా ఉందని, ఎవరికీ సమాచారం ఇవ్వకుండా ఎవరికివారు ఉదయానికి బయలుదేరితే ఎలా సమాచారం తెలుస్తుంది? అందుకే దానిపై సరిగా మైలేజీ రావడం లేదని పార్టీ నేతలు బాబు దృష్టికి తీసుకువచ్చారు.
బాబు కూడా వారితో ఏకీభవిస్తూ ఒక్కరే వెళ్లడం కాకుండా అంతా కలసి వెళితేనే మంచి సందేశం వెళుతుందని, మీరంతా సమన్వయంతో సమష్టి నిర్ణయంతో వెళ్లాలని ఆదేశించారు. ఈ సందర్భంగా నేతలు రేవంత్‌రెడ్డిపైనే ఫిర్యాదు చేసినట్లు కనిపించింది. మండల, నియోజకవర్గ ఇన్చార్జిలు, కమిటీలు త్వరగా భర్తీ చేసుకుని శిక్షణ శిబిరాలకు సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు.
బిజెపితో సంబంధాలపైనా చర్చ జరిగింది. ప్రత్యేక హోదా ఇస్తామని మోదీ తిరుపతిలో చెప్పారని, దానిని నెరవేర్చాల్సిన బాధ్యత ఆ పార్టీపై ఉందన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలను బిజెపి మభ్యపెడుతోందన్నారు. తెలంగాణలో ప్రాణహిత-చేవెళ్ల, ఏపిలో పోలవరం ప్రాజెక్టులను పట్టించుకోవడం లేదన్నారు. దీనిపై అవసరమైతే రెండు తెలుగు ప్రభుత్వాలు కలసి పోరాడేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. బిజెపి వైఖరి బట్టి పార్టీ ప్రతిస్పందన ఉంటుందని బాబు స్పష్టం చేశారు.
కాగా, మల్లన్నసాగర్ భూసేకరణలో తెరాస నేతలు ఏపిలో చేస్తున్న భూ సమీకరణతో పోల్చడం సరైంది కాదన్నారు. ఇక్కడ మనం రైతులను భాగస్వాములను చేయడంతోపాటు, పదేళ్లు వారికి డబ్బులు కూడా ఇస్తున్నామని, అక్కడ మాదిరిగా గ్రామాలను ఖాళీ చేయించడం లేదని వివరించారు. ఈ విషయాన్ని మీరు గట్టిగా వాదించాలన్నారు.
తెలంగాణలో రైతు రుణమాఫీపై చర్చ జరిగింది. ఏపిలో 50 వేల లోపు మాఫీ ఒకేసారి చేయడంతో లక్షల సంఖ్యలో రైతులు లబ్ధి పొందారని, అదేవిధంగా మిగిలిన వారికి వడ్డీ డిక్లేర్ చేశామన్నారు. ఇప్పుడు క్రాప్‌లోన్ ఇస్తున్నామని చెప్పారు. తెలంగాణలో రైతురుణ మాఫీ, భూసేకరణపై సమష్టి పోరాటం చేయాలని ఆదేశించారు. వాటికి సంబంధించి తన డాష్‌బోర్డులో ఉన్న సమాచారాన్ని ట్యాబ్‌లో పార్టీ నేతలకు చూపించారు. ఎంసెట్ ప్రశ్నపత్రం లీకేజీపై పార్టీ ఉద్యమించి, విద్యార్ధుల తలిదండ్రుల పక్షాన నిలబడాలన్నారు.కాగా హోదాపై సోమవారం లోక్‌సభలో అనుసరించాల్సిన వ్యూహంపై బాబు ఆదివారం పార్టీ ఎంపీలతో భేటీ కానున్నట్లు తెలిసింది.