తెలంగాణ

దోషులపై కఠిన చర్యలు తప్పవు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 30: ఎంసెట్ లీకేజీలో దోషులు ఎవరున్నా శిక్షలు తప్పవని, ఇకపై ఇలాంటి తప్పు చేయాలనే ఆలోచన వస్తేనే వెన్నులో వణుకు పుట్టేలా ప్రభుత్వ చర్యలు ఉంటాయని టిఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ తెలిపారు. టిఆర్‌ఎస్‌ఎల్‌పి కార్యాలయంలో శనివారం ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రతి అంశాన్ని వివాదం చేసి ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీయాలని కుట్ర పన్నుతున్నారని విమర్శించారు. గత ఆరు దశాబ్దాల్లో విద్యా రంగాన్ని కాటేసే విషపు నాగుల్లాంటి మాఫియాను పెంచి పోషించారని, వాటి అవశేషాలు ఇంకా వెంటాడుతున్నాయని, దీని ఫలితమే ఎంసెట్ ప్రశ్నాపత్రం లీకేజీ అని అన్నారు. లీకేజీ కుంభకోణంలో దొరికిన వారంతా గత ప్రభుత్వాల హయాంలో పెంచి పోషించిన దొంగలేనని అన్నారు. లీకేజీలో కీలక పాత్ర వహించిన రాజ్‌గోపాల్‌రెడ్డిపై గతంలోనూ లీకేజీ కేసులు ఉన్నాయని అప్పుడే కఠిన చర్యలు తీసుకొని ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని అన్నారు. ఈ వ్యవహారం బయటపడకుండా తొక్కిపెట్టాలని ప్రభుత్వం ప్రయత్నించలేదని, దొంగల అంతు చూడాలని నిర్ణయించిందని చెప్పారు. పిడి చట్టం కింద కేసులు పెట్టాలని నిర్ణయించినట్టు తెలిపారు. విద్యార్థుల్లో మనోధైర్యం పెంచే విధంగా చూడాలి కానీ ప్రతి దాన్ని రాజకీయం చేయాలని చూడడం తగదని అన్నారు.