తెలంగాణ

కన్సల్టెన్సీ మోసాల గుట్టు రట్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 30: హైదరాబాద్‌లో గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్న మ్యాన్ పవర్ కన్సల్టెన్సీ ఏజెన్సీ గుట్టు రట్టయింది. ఇద్దరు ఏజెంట్లను పశ్చిమ మండల టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి ఐదు ఇండియన్ పాస్‌పోర్టులు స్వాధీనం చేసుకున్నారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు చూపుతామంటూ అమాయకులను మోసగిస్తున్న మహమ్మద్ అబ్దుల్ తాహెర్, బి రాఘవేంద్రలు అక్రమార్జనకు పాల్పడుతున్నారని టాస్క్ఫోర్స్ డిసిపి బి లింబారెడ్డి తెలిపారు. మాసాబ్‌టాంక్‌కు చెందిన అబ్దుల్ తాహెర్ (30), ద్వారకాపురి కాలనీ, పంజగుట్టకు చెందిన రాఘవేంద్ర (34) న్యూ గల్ఫ్ ట్రావెల్ ఏజెన్సీ, ఇన్‌జీనియస్ ఎంటర్ ప్రైజెస్ పేరుతో కన్సల్టెన్సీలను స్థాపించి నిరుద్యోగ అమాయకులకు విదేశాల్లో ఉద్యోగాలిప్పిస్తామంటూ మోసగిస్తున్నారు. దేశంలోని ప్రమఖ ట్రావెల్ ఏజెన్సీలతో తమకు టైఅప్ ఉందంటూ ఒక్కొక్కరి నుంచి రూ. 50వేల నుంచి 70 వేల వరకు దండుకుంటున్నారని, ఇప్పటి వరకు వీరు 35 మంది దగ్గర డబ్బులు వసూలు చేసినట్టు తెలిసిందని డిసిపి వెంకటేశ్వర రావు తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్టు సైఫాబాద్, పంజగుట్ట పోలీసులు తెలిపారు.