తెలంగాణ

భూసేకరణ చట్టాన్ని కాలరాస్తున్న ప్రభుత్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ములుగు, జూలై 30 : మల్లన్నసాగర్ రిజర్వాయర్ నిర్మాణంలో ప్రభుత్వం భూ సేకరణ చట్టాన్ని తుంగలో తొక్కి రైతులకు నష్టం చేకూరుస్తుందని తెలంగాణ అడ్వకేట్ జెఎసి కన్వినర్, కో కన్వినర్ చన్నారెడ్డి, ప్రహల్లాద్‌లు పేర్కొన్నారు. శనివారం హైదరాబాద్ గన్‌పార్క్ నుంచి మల్లన్నసాగర్ భూ నిర్వాసితులను పరామర్శించడానికి వస్తున్న క్రమంలో మెదక్ జిల్లా సరిహద్దు ప్రాంతమైన వంటిమామిడి అటవీ ప్రాంతంలో డిఎస్పీ శ్రీ్ధర్ ఆధ్వర్యంలో అడ్వకేట్‌లను అరెస్ట్ చేసి ములుగు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అనంతరం అడ్వకేట్‌లు పోలీస్‌స్టేషన్‌లో విలేఖరులతో మాట్లాడుతూ ప్రాజెక్ట్‌ల నిర్మాణంలో రైతులను తప్పుదోవ పట్టిస్తూ చట్టాన్ని తుంగలో తొక్కుతున్నారని విమర్శించారు. ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టేటప్పుడు గ్రామాలలో గ్రామ సభలు నిర్వహించి రైతులకు అవగాహన కల్పించి భూసేకరణ చేపట్టాలిగానీ రైతులను భయబ్రాంతులకు గురిచేసి లాక్కోవడం చట్టానికి వ్యతిరేకమన్నారు. రాష్ట్రంలో కెసిఆర్ పాలన నైజాం పాలనను గుర్తుచేస్తున్నదని విమర్శించారు. రైతులకు న్యాయం జరిగేవరకు రైతుల పోరాటం చేస్తామని వారు చెప్పారు. అరెస్ట్ సమయంలో ఎమ్మెల్సీ భానుప్రసాద్ లాయర్ల పైకి వాహనాన్ని తీసుకొచ్చి ప్రసాద్ అనే లాయర్‌ను తీవ్రంగా గాయపరచారని అతనిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని జాతీయ మానవ హక్కుల సంఘానికి నివేదిస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో జెఎసి నాయకులు ప్రసాద్‌రెడ్డి, కొండారెడ్డి, గిరి, రాజీవ్‌రెడ్డి, అంతోని, శ్రీనివాస్‌తో పాటు 50 మంది అడ్వకేట్‌లు పాల్గొన్నారు.

చిత్రం.. అడ్వకేట్ జెఎసి నాయకులను అరెస్ట్ చేస్తున్న డిఎస్సీ శ్రీ్ధర్