తెలంగాణ

రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నవాబుపేట/జడ్చర్ల, ఆగస్టు 1: ఎన్నికలకు ముందు సంపన్న రాష్ట్రంగా ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని టిఆర్‌ఎస్ పార్టీ నాయకులు అనుభవ లేమితో పరిపాలించి అప్పుల పాలు చేశారని టిడిపి రాష్ట్ర అద్యక్షుడు ఎల్. రమణ ధ్వజమెత్తారు. సోమవారం మహ బూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభు త్వ ఏర్పాటు సమయంలో రాష్ట్ర ముఖ్యమం త్రి కెసిఆర్ నూతనంగా ఏర్పడిన రాష్ట్రాన్ని అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానని చిలుక పలుకులు పలికి ఆ తర్వాత నియంతృత్వ పోకడలతో తనను గద్దెను ఎక్కించిన కోదండరాం లాంటి వారినే దూరం చేసుకున్నారని విమర్శించారు. 26 నెలల టిఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజలకు చేసింది ఏమీ లేదని ఆయన ఆరోపించారు. దేశవ్యాప్తంగా 29 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో లేనివిధంగా ముఖ్యమంత్రి కెసిఆర్ తన ఫాంహౌస్‌కే పరిమితమై పరిపాలన చేస్తూ రాష్ట్రాన్ని అథోగతిపాలు చేశారని ఆయన అన్నారు. అసెంబ్లీ సమావేశాలు నిర్వహించకుండా సిఎం తన ఇష్టానుసారంగా పరిపాలన చేస్తూ అనుభవరాహిత్యాన్ని కళ్లకు కట్టినట్లుగా రాష్ట్ర ప్రజలకు చూపుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రాజెక్టుల నిర్మాణాల విషయంలో జాప్యం కారణంగా వాటి నిర్మాణ వ్యయం కోట్లల్లో అధికమవుతోందని ఆయన అన్నారు. పాలమూరు ఎత్తిపోతల డిజైన్‌లో మార్పుల వల్ల రూ.35 కోట్ల వ్యయంతో ప్రారంభించిన ప్రాజెక్టు నిర్మాణ అంచనాల్లో నేటికి రూ.55 కోట్లకు చేరాయని, అవి పూర్తయ్యేసరికి రూ.లక్షకోట్ల వ్యయానికి భారం చేరుకుంటుందని ఆయన అన్నారు.

చిత్రం.. జడ్చర్లలో విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న తెలంగాణ తెదేపా అధ్యక్షులు ఎల్ రమణ