తెలంగాణ

తప్పు మీదంటే మీదే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 2: ఎమ్సెట్-2 నిర్వహణలో రోజురోజుకూ అనేక అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. ఎమ్సెట్ ప్రక్రియ పూర్తి చేసేందుకు రిజిస్టర్డ్ బిడ్డర్ల మధ్య పోటీతో ఈ అక్రమాలు ఒకొక్కటీ బయటపడుతున్నాయి. ప్రధానంగా డేటామెథడెక్స్, మాగ్నటిక్ ఇన్ఫోటెక్ లిమిటెడ్‌ల మధ్య పోరుతో పరస్పరం ఆరోపణలు చేసుకుంటూ ఉన్నత విద్యా మండలికి అనేక ఫిర్యాదులు వచ్చాయి. ఎమ్సెట్-2 డేటా విశే్లషణ, డేటా సంశే్లషణ, హాల్‌టిక్కెట్లు జారీ, ఒఎంఆర్ షీట్‌ల రూపకల్పన సహా నోటిఫికేషన్ మొదలు చివరి వరకూ వివిధ దశల్లో ఐటి పరిష్కారాలను అందించేందుకు ఉన్నత విద్యామండలి ఈసారి మాగ్నటిక్ ఇన్ఫో టెక్ లిమిటెడ్‌ను ఎంపిక చేసింది. అయితే ఎలాంటి అర్హత లేని సంస్థను ఎంపిక చేయడంతో ఎమ్సెట్ నిర్వహణలో అనేక లోపాలు జరిగాయని డేటా మెథడెక్స్ సంస్థ ప్రభుత్వానికి ఫిర్యాదు చేసింది. ఈ లేఖను అధికారులు రహస్యంగా ఉంచినా, అందులో అంశాలు అన్నీ మాగ్నటిక్ ఇన్ఫో లోపాలను ఎత్తి చూపాయని విశ్వసనీయంగా తెలిసింది. బిడ్డర్‌తో పాటు ప్రింటర్ ఎంపికలో కూడా అనేక లోపాలు జరిగినట్టు ఈ వివాదాల వల్ల తెలుస్తోందని సాంకేతిక విద్యాశాఖ అధికారి ఒకరు చెప్పారు. వాస్తవానికి ఈ ఎంపిక వ్యవహారం అంతా గోప్యంగానే జరుగుతుంది. అయితే అధికారులపై ఒక మంత్రి, ఒక ఎమ్మెల్సీ సహా మరికొందరి ఒత్తిడి ఉందనేది సుస్పష్టమైంది. డేటా మెథడెక్స్ ఫిర్యాదులను మాగ్నటిక్ ఇన్ఫో ఎండి విజయ్ ఎన్ రావు కొట్టి పారేశారు. తాము చాలా రహస్య డాక్యుమెంట్లను తయారుచేస్తామని వాటిని బయట పెట్టలేమని, అయితే తమ సంస్థకు ఎమ్సెట్ నిర్వహణలో విశేష అనుభవం ఉందని గతంలోనూ ఎమ్సెట్‌కు సంబంధించి చాలా డాటా విశే్లషణ తామే చేశామని ఆయన పేర్కొన్నారు.