తెలంగాణ

ఐదు కోట్లతో చిట్టీల వ్యాపారి పరారీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నార్కట్‌పల్లి, జనవరి 6: ఐదుకోట్ల రూపాయలతో ఓ చిట్టీల వ్యాపారి ఉడాయించిన సంఘటన నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండల కేంద్రంలో వెలుగుచూసింది. నమ్మకమే పెట్టుబడిగా ప్రజల్లో మంచి గుర్తింపు సాధించిన అక్కనపల్లి సైదులు అనే వ్యక్తి నార్కట్‌పల్లిలో చిట్టీల వ్యాపారం నిర్వహిస్తూ ఐదు కోట్ల రూపాయలతో మంగళవారం అర్ధరాత్రి ఉడాయించాడు. ఈ విషయం తెల్లవారకముందే పట్టణంలో దావానలంలా వ్యాపించడంతో బాధితులు గుండెలు బాదుకుంటూ సైదులు ఇంటికి చేరుకుని ఆందోళనకు దిగారు. కన్నబిడ్డల పెళ్లిళ్ల కోసం కొందరు, పిల్లల చదువుల కోసం మరికొందరు, వైద్యం ఖర్చుల కోసం ఇంకొందరు ఇలా తలో సమస్యల నేపధ్యంలో ఆర్థిక భద్రత కోసం సైదులు వద్ద చిట్టీలు వేయగా అందర్నీ నట్టేట ముంచి సైదులు పారిపోవడంతో బాధితులంతా గగ్గోలు పెడుతున్నారు. కొందరు తమ డబ్బులు తిరిగి వస్తాయో లేదోనంటూ బెంగతో రోదిస్తున్నారు. సైదులు బాధితులు మొత్తం 470 మంది ఉన్నట్లుగా లెక్క తేలింది. సైదులు 20 ఏళ్లుగా స్థానికంగా చిట్టీల వ్యాపారం చేస్తుండడంతో అతనిపై నమ్మకంతో చాలామంది అతడి వద్ద చిట్టీలు వేసి డబ్బులు జమ చేసుకున్నారు.
50 వేల నుండి 5 లక్షల వరకు సైదులు చిట్టీలు నడపగా సాధారణ, మధ్యతరగతివర్గ ప్రజలు మొదలుకుని ధనికుల వరకు అతడి వద్ద చిట్టీలు వేశారు. గత మూడు నెలలుగా సైదులు చిట్టీలు కట్టిన వారికి చెల్లించాల్సిన డబ్బులు సకాలంలో ఇవ్వకుండా తిప్పుతుండడంతో గొడవలు జరుగుతుండగా మాయమాటలతో కాలం నెట్టుకొచ్చి మంగళవారం రాత్రి ఊరు వదలి ఉడాయించాడు.
కాగా, సైదులుకు పట్టణంలో విలువైన గృహాలు, ఇళ్ల స్థలాలు, చిన్నతరహా పైపుల కంపెనీ కూడా ఉంది. తన ఆస్తులన్నీ ముందస్తుగా సైదులు ఇతరుల పేరు మీద బదిలీ చేసినట్లుగా తెలుస్తుండడం బాధితులను మరింత ఆందోళనకు గురిచేస్తోంది. అయితే సైదులుకు చెందిన సదరు ఆస్తులన్నింటినీ ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నట్లయితే బాధితులందరికి కూడా తిరిగి వారికి ఇవ్వాల్సిన డబ్బులన్నింటినీ ఇప్పించవచ్చని, ఇందుకు అధికారులు చొరవ తీసుకుని తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. సైదులు తమను మోసగించిన విషయమై బాధితులు నార్కట్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

మరో రెండు కేసుల్లో
ఎఎస్‌ఐ మోహన్‌రెడ్డికి
13 వరకు జుడీషియల్ కస్టడీ
లీగల్ (కరీంనగర్), జనవరి 6: అక్రమ వడ్డీ వ్యాపారం కేసుతో పాటు జిల్లా కేంద్రంలోని కెన్‌క్రెస్ట్ విద్యాసంస్థల అధినేత రామవరం ప్రసాదరావు ఆత్మహత్య కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న ఎఎస్‌ఐ మోహన్ రెడ్డిని పిటి వారంట్‌పై కరీంనగర్ మూడవ పట్టణ పోలీసులు బుధవారం కరీంనగర్ అడిషనల్ మున్సిఫ్ మేజిస్ట్రేట్ కోర్టు న్యాయమూర్తి మాధవి ఎదుట హాజరుపర్చారు. నగరంలోని జ్యోతినగర్ ప్రాంతానికి చెందిన సంకిసాల సరళ తన కొడుకు పైచదువుల నిమిత్తం మోహన్ రెడ్డి వద్ద 15 లక్షల రూపాయలు అప్పు తీసుకుంది. దీనికి గాను మోహన్‌రెడ్డి సరళ ఇంటిని జిపిఎ చేయించుకుని చెక్కులు, ప్రామిసరీ నోట్‌లతో పాటు తెల్లకాగితాలపై సంతకాలు తీసుకొని మోసగించాడని మూడవ పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు మేరకు మోహన్‌రెడ్డితో పాటు కేతిరెడ్డి జగన్‌మోహన్ రెడ్డి, శ్రీ్ధర్ రెడ్డి, జ్ఞానేశ్వర్, నర్సింగ్‌లను నిందితులుగా పేర్కొంటూ కేసు నమోదు చేశారు. మరో కేసులో ఆర్టీసీ వర్క్‌షాపు ప్రాంతానికి చెందిన పాక సువర్ణలత అవసరం నిమిత్తం మోహన్ రెడ్డి వద్ద 11 లక్షలు అప్పుగా తీసుకున్నది. ఆమె ఫిర్యాదు మేరకు మోహన్‌రెడ్డితో పాటు సింగిరెడ్డి జితేందర్‌రెడ్డి, బొబ్బల కమలాకర్ రెడ్డి, నర్సింగ్, పంకజ్ సింగ్, రాంచంద్రారెడ్డి, శ్రీనివాస్ రెడ్డిలను నిందితులుగా పేర్కొంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ రెండు కేసులలో జిల్లా జైలు నుండి మోహన్‌రెడ్డిని పోలీసులు కోర్టులో హాజరుపర్చగా, ఈ నెల 13 వరకు జుడీషియల్ కస్టడీకి ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ రెండు కేసుల్లో కొంతమంది నిందితులు గతంలోనే అరెస్టయి జైల్లో ఉండగా, మరికొందరిని త్వరలోనే అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
14రోజుల రిమాండ్ విధించిన జగిత్యాల కోర్టు
జగిత్యాల: ఎఎస్సై మోహన్‌రెడ్డికి జగిత్యాల సెకండ్ సెషన్ జడ్జి కవిత 14 రోజుల రిమాండ్ విధిస్తూ తీర్పు చెప్పారు. మల్యాల మండలం బల్వంతాపూర్ గ్రామ శివారులోని 12ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్న కేసులో కొడిమ్యాల మండల కేంద్రానికి చెందిన బోగ లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు జగిత్యాల కోర్టులో బుధవారం హాజరుపర్చారు.
బోగ లక్ష్మికి చెందిన 12 ఎకరాల భూమిని ఎఎస్సై మోహన్‌రెడ్డి దగ్గర తాకట్టు పెట్టికొని రూ. 25 లక్షలు అప్పుగా తీసుకుంది. తిరిగి అప్పు చెల్లిస్తానని చెప్పినప్పటికీ తీసుకోకుండా భూమిని స్వాధీనం చేయకుండా వేధింపులకు గురి చేస్తున్నట్లు లక్ష్మి మల్యాల పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ కేసులో జగిత్యాల సెకండ్ సెషన్ జడ్జి కవిత ఎదుట ఎఎస్సై మోహన్‌రెడ్డిని హాజరు పర్చగా 14రోజుల రిమాండ్ విధిస్తూ జడ్జి కవిత తీర్పు చెప్పారు.