తెలంగాణ

శభాష్ వెంకటయ్య!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 4: జాతీయ స్థాయిలో ఉత్తమ పారిశుద్ధ్య కార్మికుడిగా ఎంపికైన వెంకటయ్యను గురువారం సచివాలయంలోని తన కార్యా లయంలో మున్సిపల్ వ్యవహారాల శాఖ మంత్రి కె.తారక రామారావు సత్కరించారు. వ్యక్తిగత బహుమానంగా ఒక లక్షా 11వేల 111 రూపాయల నగదుతో పాటు శాలువతో వెంకటయ్యను సత్కరించారు. దీంతో పాటు జిహెచ్‌ఎంసి నుండి మరో లక్ష రూపాయల చెక్కు అందజేశారు. స్వచ్ఛ భారత్ మిషన్, స్వచ్ఛ సర్వేక్షణ్‌లో భాగంగా జాతీయ స్థాయిలో ఇద్దరు కార్మికులు ఎంపిక కాగా, వీరిలో జిహెచ్‌ఎంసి రాజేంద్రనగర్ సర్కిల్‌కు చెందిన పారిశుద్ధ్య కార్మికుడు వెంకటయ్య ఒకరు. దేశవ్యాప్తంగా ఇద్దరిని ఎంపిక చేస్తే, అందులో జిహెచ్‌ఎంసి కార్మికుడు ఒకరు ఉండడంతో కెటిఆర్ అతన్ని తన కార్యాలయానికి పిలిచి మాట్లాడారు. సెలవు తీసుకోకుండా పనిచేస్తుండడంపై ఆశ్చర్యపోయన ఆయన వెంకటయ్య కుటుంబ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఢిల్లీలో అవార్డు తీసుకోవడానికి వెళ్లేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను కెటిఆర్ ఆదేశించారు. స్వచ్ఛ హైదరాబాద్ లక్ష్యాన్ని చేరుకోవడానికి వెంకటయ్య లాంటి కార్మికుల పనితీరు, సేవాభావం స్ఫూర్తిగా తీసుకో వాలన్నారు. హైదరాబాద్‌లో ఇష్టానుసారం చెత్తవేసే వారు వెంకటయ్యలా కష్టపడుతున్న పారిశుద్ధ్య కార్మికుల కృషిని గుర్తించాలని కెటిఆర్ సూచించారు. వెంకటయ్య సత్కార కార్యక్రమానికి నగర మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియొద్దీన్, జిహెచ్‌ఎంసి కమిషనర్ డాక్టర్ బి జనార్దన్‌రెడ్డి తదితరులు హాజరయ్యారు.

చిత్రం.. జాతీయ స్థాయలో ఉత్తమ పారిశుద్ధ్య కార్మికుడిగా ఎంపికైన వెంకటయ్యను గురువారం తన కార్యాలయానికి పిలుపించుకొని సత్కరించిన మున్సిపల్ వ్యవహారాల మంత్రి కె.తారకరామారావు.