తెలంగాణ

బహుభాషా పండితుడు రాఘవాచారి అస్తమయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 5: సంస్కృతం, తెలుగు భాషల్లో పండితులు, ప్రభుత్వ సలహాదారు కెవి రమణాచారి తండ్రి అయిన కె రాఘవాచారి(90) శుక్రవారం హైదరాబాద్‌లో కన్నుమూశారు. పాదుకా సహస్రం సంస్కృత గ్రంధానికి రాఘవాచారి వ్యాఖ్యానం ప్రఖ్యాతి చెందింది. పలు సంస్కృత గ్రంథాలకు రాఘవాచారి వ్యాఖ్యానాలు చేశారు. తెలుగులోనూ పలు గ్రంథాలు ఆయన రచించారు. భాగవత సంప్రదాయాలను చివరి వరకు పాటించారు. తెలంగాణకు చెందిన ఈ విద్వాంసునికి లభించాల్సినంత గుర్తింపు లభించలేదని కోవెల సంపత్కుమారాచార్య అన్నారు. కరీంనగర్ జిల్లా నారాయణగిరి గ్రామంలో జన్మించిన రాఘవాచారి తన కుమారుడు కెవి రమణాచారి వద్దనే హైదరాబాద్‌లో ఉంటున్నారు. ఆదివారం అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు. బహుభాషా పండితుడు రాఘవాచారి మృతికి తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రగాఢ సంతాపం తెలిపారు.