తెలంగాణ

టౌన్‌ప్లానింగ్ అధికారి ఆస్తులు రూ.10కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 5: ఆదాయానికి మించి అస్తులు కలిగి ఉన్నాయన్న ఆభియోగాలపై జిహెచ్‌ఎంసి టౌన్ ప్లానింగ్ అధికారి, వారి బంధువుల ఇళ్లపై అవినీతి నిరోధకశాఖ దాడులు నిర్వహించింది. ఖైరతాబాద్‌లోని జిహెచ్‌ఎంసి సర్కిల్ -10 కార్యాలయంలో పట్టణ ప్రణాళిక విభాగం అధికారి (అసిస్టెంట్ సిటీ ప్లానర్)గా ఎ.సంతోష్ వేణు పనిచేస్తున్నారు.
నారాయణగూడలోని అతని నివాసంలో శుక్రవారం ఉదయం నుంచి అవినీతి నిరోధకశాఖ డిఎస్పీ రవికుమార్ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. వివిధ ప్రాంతాల్లో సంతోష్ వేణుకు రూ.10కోట్ల విలువైన ఆస్తులు (మార్కెట్ విలువ ప్రకారం) ఉన్నట్లు ఏసిబి అధికారులు గుర్తించారు. టౌన్‌ప్లానింగ్ అధికారి ఇంట్లో రూ.3.5 లక్షల నగదు, 70 తులాల బంగారంతో పాటు ఆయనకు పలు ఇళ్లు ఉన్నట్లుగుర్తించారు. గుడిమల్కాపూర్‌లోని సంతోష్‌వేణు సోదరి నివాసంలో కూడా ఏసిబి అధికారులు సోదాలు జరిపారు. గతంలో శేరిలింగంపల్లి ప్రాంతంలో పట్టణ ఉప ప్రణాళికాధికారిగా పనిచేసిన సమయంలో సంతోష్‌వేణుపై అనేక ఆరోపణలు వచ్చాయి.
ప్రభుత్వం ప్రకటించిన బిపిఎస్ పథకాన్ని అవకాశంగా మలుచుకుని అక్రమాలకు పాల్పడినట్లు జిహెచ్‌ఎంసి వర్గాల్లో విస్తృతంగా ప్రచారం జరుగుతొంది. ఏసిబి అధికారులు నారాయణగూడ, అంబర్‌పేట్ డిడి కాలనీ, గుడిమల్కాపూర్, హిమాయత్‌నగర్, ఎర్రగడ్డలలో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. త్రిబుల్ బెడ్‌రూమ్ ఇళ్లతో పాటు నారాయణగూడలోఏడు ప్లాట్లు, డిడి కాలనీలో జిప్లస్ వన్ ఇళ్లు, గుడిమల్కాపుర్‌లో ఒక ఇల్లు, హిమాయత్‌నగర్‌లో ఒక ఫ్లాట్, ఎర్రగడ్డలో ఒక ఫ్లాట్ ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
రెండు కార్లు, సుజుకీ బైక్‌తో పాటు రూ.3.5 లక్షల నగదును స్వాధీనం చేసుకోగా, నాలుగు లక్షల బ్యాంక్ బ్యాలెన్స్ కలిగిన ఆకౌంట్‌లను ఏసిబి అధికారులు స్వాధీనం చేసుకుని సంతోష్ వేణును అరెస్టు చేశారు.

హైదరాబాద్‌లో శుక్రవారం టౌన్ ప్లానింగ్ అధికారి సంతోష్ వేణు ఇంట్లో సోదాలు చేస్తున్న ఏసిబి అధికారులు