తెలంగాణ

ఉప ఎన్నిక కానుక- వరంగల్ పట్టణానికి 30వేల డబుల్ బెడ్రూంలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, జనవరి 6: ఇటీవల జరిగిన వరంగల్ ఉప ఎన్నికల ఫలితాలకు కానుకగా ముఖ్యమంత్రి కెసిఆర్ వరంగల్ ప్రజలకు 30వేల డబుల్‌బెడ్‌రూం ఇండ్లను మంజూరు చేశారు. బుధవారం వరంగల్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నగరంలో 700 ఎకరాల ప్రభుత్వ భూములను గుర్తించామని, పేదల ఇండ్ల నిర్మాణాల కోసం వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ఇండ్లు లేని నిరుపేదలు ఉండకూడదనే ఉద్దేశ్యంతోనే ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికి డబుల్‌బెడ్‌రూం ఇండ్లు నిర్మించి ఇస్తుందన్నారు. ఇందుకోసం అర్హులైన ప్రతి ఒక్కరు సంబంధిత తహసీల్‌కు గానీ నేరుగా కలెక్టర్‌కు గానీ దరఖాస్తు చేసుకోవాలని సిఎం కోరారు. దరఖాస్తు చేసుకున్న ప్రతి అర్జిదారుడి పేరు వార్డుసభలో డిస్‌ప్లే చేస్తామని చెప్పారు. లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. 2017 నాటికి 30వేల ఇండ్లు నిర్మాణం అయి తీరుతాయన్నారు. ఈ మార్చి నుండే ఈ పథకం ప్రారంభమవుతుందని తెలిపారు. మాజీ సైనికులకు సంబంధించిన ఆస్తి వారి భార్యపేరు మీద ఉన్నట్లయితే వారికి ఆస్తిపన్ను మినహాయిస్తామని తెలిపారు. అదే విధంగా జిల్లాకు కేటాయించిన డబుల్‌బెడ్‌రూంలో రెండు శాతం మాజీ సైనికులకు మంజూరు చేస్తామన్నారు.
కేంద్ర సహాయంతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులు చేపట్టనున్నట్లు కెసిఆర్ తెలిపారు. తాను ఈ మేరకు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడితో మాట్లాడానని, ఆయన అందుకు సానుకూలంగా స్పందించారన్నారు. ఈ సమావేశంలో స్పీకర్ మధుసూదనాచారి, డిప్యూటీ సిఎం కడియం శ్రీహరి, మంత్రి చందులాల్, ఎంపిలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.