ఆంధ్రప్రదేశ్‌

మావాళ్ల జాడ తెలియజేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఆగస్టు 5: ‘విమానం అదృశ్యమై రెండు వారాలు అవుతోంది. సముద్రంలో శోధన పేరుతో ఏం జరుగుతుందో కనీస సమాచారాన్ని కూడా అధికారులు చెప్పడం లేదు. ఇది ప్రాణాలకు సంబంధించిన వ్యవహారం. అత్యాధునిక పరిజ్ఞానాన్ని దశల వారీగా కాకుండా ఒకేసారి ఉపయోగించి జాడ కనుక్కోండి. మావాళ్లను సురక్షితంగా తిరిగి అప్పగించండి. పిల్లలకు సమాధానం చెప్పలేక పోతున్నాం’ అంటూ వాయుసేనకు చెందిన ఎఎన్ 32 విమానం అదృశ్య ఘటనకు సంబంధించి విశాఖలోని ఎన్‌ఎడి ఉద్యోగుల బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత నెల 22న జరిగిన విమానం అదృశ్య ఘటనలో ఎన్‌ఎడికి చెందిన 8 మంది ఉద్యోగుల ఆచూకీ లభించకపోవడం తెలిసిందే. ఇప్పటికీ ఎటువంటి జాడ కనుగొనకపోవడం, అధికారులు కనీస సమాచారాన్ని వారం రోజులుగా చెప్పకపోవడంతో ఆ ఉద్యోగుల కుటుంబ సభ్యులు విశాఖపట్నంలో శుక్రవారం విలేఖరుల సమావేశం ఏర్పాటు చేసి తమ ఆవేదనను వ్యక్తం చేశారు. గల్లంతైన ఎన్‌ఎడి ఉద్యోగులకు చెందిన బంధువులు కిరణ్‌కుమార్, ప్రసాద్, సంతోష్, తదితరులు అధికారుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ఘటన జరిగిన తొలినాళ్లలో తమకు ఎప్పటికప్పుడు సమాచారం అందచేసి ధైర్యం చెప్పేవారని, కానీ ఇప్పుడు కనీస సమాచారం ఇవ్వకుండా వ్యవహరిస్తున్నారన్నారు. గల్లంతు అయింది వస్తువులు కావని, విలువైన ప్రాణాలని గుర్తు చేశారు. అందుబాటులో ఉన్న అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని విదేశాల నుంచి అయినా తీసుకుని వీలైనంత త్వరగా తమ వారిని అప్పగించాలని కోరారు. ఇప్పటి వరకూ పిల్లలకు ఉద్యోగం నుంచి తిరిగి వస్తారని చెబుతున్నామని, కానీ ఇప్పుడు పిల్లలు ఏడుస్తుంటే ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నామన్నారు. శోధనలో దశల వారీగా కాకుండా ఒకేసారి నౌకలను, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలని కోరారు.
రోజులు గడుస్తున్న కొలదీ తమలో టెన్షన్ పెరిగిపోతోందని గుర్తు చేశారు. గల్లంతైన విమానంలో బీకన్ లొకేటర్ లేదని అధికారులు చెప్పడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అటువంటి విమానాన్ని ఉపయోగించి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడటం ఎందుకని ప్రశ్నించారు. అంతా సజావుగా జరిగి ఉంటే ఈ నెల 6న వారు విశాఖకు చేరుకునే వారని గుర్తు చేశారు. ప్రధాని, ముఖ్యమంత్రి ఈ విషయంలో దృష్టి సారించాలని కోరారు. నౌకాదళ అధికారులు వాస్తవాలను తెలియచేయాలని డిమాండ్ చేశారు. సముద్ర జలాల్లో శోధన ఎంత శ్రద్ధగా చేస్తున్నారో కూడా తెలియచేయాల్సి ఉందన్నారు. భరించలేని టెన్షన్‌లో ఉన్న తమకు సమాచారం తెలియచేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.