తెలంగాణ

ఘనంగా జయశంకర్ జయంతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 6: ప్రొఫెసర్ జయశంకర్ 82వ జయంతి వేడుకలను శనివారం రాష్టమ్రంతటా ఘనంగా నిర్వహించారు. ముఖ్యమంత్రి కెసిఆర్ తెలంగాణ భవన్‌లో జయశంకర్‌కు నివాళులర్పించారు. జయశంకర్ జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడంతో అన్ని జిల్లాల్లో మంత్రులు ఆయన విగ్రహాలకు, చిత్ర పటాలకు నివాళులర్పించారు. తెలంగాణ భవన్‌లో కెసిఆర్‌తో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపిలు, పార్టీ నాయకులు జయశంకర్‌కు నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్రం కోసం జీవితాంతం పరితపించిన జయశంకర్ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత జయశంకర్ లేకపోవడం బాధాకరమని, అందరూ జయశంకర్ చూపిన మార్గంలో పయనించడమే ఆయనకు నిజమైన నివాళి అని ఎంపి వినోద్ అన్నారు. నల్లగొండ పర్యటనలో ఉన్న ఎంపి కవిత ఆ జిల్లాలోనే జయశంకర్‌కు నివాళులర్పించారు. రాష్ట్ర శాసనసభ స్పీకర్ మధుసూధనాచారి వరంగల్‌లో ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాన్ని ఆవిష్కరించి, నివాళి అర్పించారు. ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంతో పాటు తెలంగాణలోని అన్ని విశ్వవిద్యాలయాల్లో ఆయనకు నివాళి అర్పించారు. సచివాలయంలో ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి జయశంకర్‌కు నివాళి అర్పించారు.

చిత్రం..శనివారం తెలంగాణ భవన్‌లో జయశంకర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పిస్తున్న సిఎం కెసిఆర్