ఆంధ్రప్రదేశ్‌

సేవా కార్యక్రమాలను ఇంకా విస్తరిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 7: నందమూరి తారక రామారావు పేరున ఏర్పాటు చేసిన ఎన్‌టిఆర్ ట్రస్ట్ సేవా కార్యక్రమాలను మరింత విస్తరిస్తామని ట్రస్టీ నారా లోకేష్ తెలిపారు. ఆదివారం కాకతీయ హోటల్‌లో మెంటర్ ది హీరో పేరుతో చిత్రకారుడు హరి ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1996వ సంవత్సరంలో నాన్న చంద్రబాబు పేదలకు సేవలందించే సంకల్పంతో ట్రస్ట్‌ను ఏర్పాటు చేశారని చెప్పారు. ఈ ట్రస్ట్ ద్వారా వివిధ కారణాలతో తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులకు విద్యాబుద్ధులను నేర్పుతున్నట్టు చెప్పారు. నేరుగా తమ పాఠశాలలో 1200 మంది విద్యార్థులకు బోధిస్తుండగా వివిధ పాఠశాలల్లో చదువుతున్న మరో 2వేల మందికి పైగా సహాయ సహకారాలు అందిస్తున్నట్టు చెప్పారు. మెంటర్ ది హీరో ఆలోచన తాను విశాఖపట్నం వెళుతుండగా వచ్చిందని, అనాథ పిల్లల చదువులకు సహకరించాలనుకునే వారు వారి స్థోమతను బట్టీ సహాయం అందించడమే దీని లక్ష్యమన్నారు. ఈ కానె్సప్టు నచ్చి తమ పాఠశాలో చదువుతున్న వారికి మెంటర్‌గా వ్యవహరించేందుకు దేశ, విదేశాల నుంచి ఎంతోమంది ఆసక్తి చూపడం ఆనందంగా ఉందన్నారు. అందరి సహకారం ఉంటేనే ఏ మంచిపనైనా ముందుకు సాగుతుందన్నారు. వచ్చే విద్యాసంవత్సరం లోపు వరంగల్, చర్లపల్లిలో తమ పాఠశాలను ప్రారంభించనున్నామని, భవిష్యత్‌లో ఏపి, తెలంగాణ రాష్ట్రాల్లోని అన్ని జిల్లాల్లో తమ పాఠశాలలను నెలకొల్పి పేదలకు విద్యను అందిస్తామని చెప్పారు. వీటితో పాటు యువతకు నైపుణ్యాలపై శిక్షణ అందించి ఉద్యోగ కల్పనకు సైతం తోడ్పాటును అందించనున్నామని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్ధులకు మెంటర్లుగా వ్యవహరించేందుకు ముందుకు వచ్చిన వారిని సన్మానించారు. చిత్రకారుడు హరి మాట్లాడుతూ తన పెయింటింగ్స్ అమ్మకం ద్వారా వచ్చిన మొత్తాన్ని చిన్నారుల చదువుల కోసం అందించనున్నట్టు చెప్పారు. తాను ఇద్దరు పిల్లలకి మెంటర్‌గా ఉంటానని నటి మంచులక్ష్మి తెలిపారు. పేదరికంలో మగ్గుతున్న వారికి సేవ అందించడంలోనే నిజమైన ఆనందం ఉంటుందని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో ఐఐసిటి డైరెక్టర్ శ్రీవారి చంద్రశేఖర్, కృష్ణ, విజయ్ సింగ్, లక్ష్మినివాస్ శర్మ పాల్గొన్నారు.