తెలంగాణ

పుష్కర పనులు అవినీతిమయం: డికె

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 9: పుష్కర ఘాట్ల పనుల్లో టిఆర్‌ఎస్ నాయకులు జేబులు నింపుకుంటున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి డికె అరుణ విమర్శించారు. తాత్కాలిక పనులు చేపట్టి కోట్ల రూపాయలు దండుకుంటున్నారని ఆమె మంగళవారం విలేఖరుల సమావేశంలో విమర్శించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల పరిథిలో ఉన్న పుష్కర ఘాట్లపై ప్రభుత్వం వివక్ష చూపిస్తోందని ఆమె విమర్శించారు. ఎమ్మెల్యే సంపత్ కుమార్ మాట్లాడుతూ కృష్ణా పుష్కరాల పనులతో టిఆర్‌ఎస్ నేతలు ధనార్జన, స్వార్థ రాజకీయ ప్రయోజనాలే లక్ష్యంగా పనిచేస్తున్నారని విమర్శించారు.