ఆంధ్రప్రదేశ్‌

భక్తుల భద్రతకు భరోసా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 9: భద్రతే లక్ష్యంగా పుష్కర ఏర్పాట్లు చేసినట్టు రాష్ట్ర పోలీస్ డైరక్టర్ జనరల్ ఎన్ సాంబశివరావు తెలియచేశారు. మంగళవారం ఆయన ఇక్కడ ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ పుష్కర విధుల నిర్వహణకు 30 మంది ఐపిఎస్ అధికారుల సహా 31,401 మంది సిబ్బందిని నియమించామని తెలియచేశారు. విజయవాడలో 17 వేల మందిని, కృష్ణా జిల్లాలో 3,200 మందిని, గుంటూరు అర్బన్‌లో 3,400 మందిని, గుంటూరు రూరల్‌లో 4,200 మందిని, కర్నూలులో 2,700 మందిని, మిగిలిన 1670 మందిని విజయవాడ రైల్వే స్టేషన్‌లో నియమించామని ఆయన చెప్పారు. కర్ణాటక, ఒడిశా, చత్తీస్‌గడ్‌తోపాటు కేంద్ర బలగాలను కూడా ఇక్కడికి రప్పించారు. చెన్నై-కోల్‌కత్తా, హైదరాబాద్-కోల్‌కత్తాకు వెళ్లే భారీ వాహనాలను విజయవాడ నగరం బయట తరలించేందుకు గుంటూరు ఐజి సంజయ్, ఏలూరు రేంజ్ డిఐజి రామకృష్ణ ప్రణాళిక సిద్ధం చేశారని ఆయన చెప్పారు. ఘాట్‌లు, దేవాలయాల వద్ద భక్తులకు ఆహార పదార్ధాలను అందించేందుకు ఏర్పాటు చేస్తున్నారు. సుమారు 20 కోట్ల సెంట్రల్ కంట్రోల్ రూంను ఏర్పాటు చేసినట్టు డిజిపి సాంబశివరావు తెలిపారు. 1300 కెమేరాలు, డ్రోన్ కెమేరాల ద్వారా వివిధ ఘాట్‌లు, నగరంలో ఉన్న యథాతథ పరిస్థితిని ఈ సెంట్రల్ కంట్రోల్ రూం ద్వారా తెలుసుకుంటారు. నగరంలో జనాభా కిక్కిరిసి ఉన్నప్పుడు ఏలూరు, తాడేపల్లిగూడెంలలో రైళ్ళు, బస్సులను కాసేపు నిలిపివేయాలని నిర్ణయించినట్టు ఆయన వెల్లడించారు. భక్తులు ఏ ఘాట్‌లో స్నానం చేసినా పవిత్రత చేకూరుకుందని, అందరూ ఒకే ఘాట్‌లో స్నానాలు చేయాలన్న ఆలోచన మానుకోవాలని ఆయన సూచించారు. 12 రోజులూ మంచి రోజులేనని భక్తులు గుర్తించాలని ఆయన చెప్పారు. హైవేపై అనుమతి లేని వాహనాలను నిలిపి ఉంచితే వాటిని వెంటనే సీజ్ చేస్తామని, ఆ వాహనాలను సుదూర ప్రాంతానికి తరలించేస్తామని, సదరు వాహన యజమానికి భారీగా అపరాథ రసుము విధిస్తామని ఆయన తెలిపారు.
టోల్ గేట్‌ల వద్ద ట్రాఫిక్ జాం కాకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలియచేశారు. సోషల్ మీడియా తప్పుడు ప్రచారాలను కూడా నమ్మద్దని చెప్పారు. చిన్న పిల్లలతో పుష్కరాలకు వచ్చే వాళ్లు పిల్లల పాస్‌పోర్టు సైజ్ ఫొటోలను కూడా తీసుకురావాలని, ఒకవేళ పిల్లలు తప్పిపోతే, ఆ ఫొటో ఆధారంగా వారిని సుళువుగా గుర్తించడానికి ఆస్కారం ఉంటుందని చెప్పారు. పుష్కరాలకు రోజుకు మూడు లక్షల మంది కేవలం రైళ్ళలోనే వచ్చే అవకాశం ఉందని ఆయన చెప్పారు. మొత్తంమీద విజయవాడ నగరానికి రోజుకు 20 నుంచి 30 లక్షల మంది పుష్కర భక్తులు వచ్చే అవకాశం ఉందని సాంబశివరావు తెలిపారు.
పుష్కరాల సమయంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు ప్రత్యేక భద్రతా బలగాలను సిద్ధంగా ఉంచామని డిజిపి సాంబశివరావు తెలియచేశారు. ఆరు లక్షల మంది నేరగాళ్ళకు సంబంధించిన వివరాలు తమ వద్ద ఉన్నాయని చెప్పారు. వివిధ ప్రాంతాల నుంచి పుష్కర ఘాట్‌లకు వెళ్ళేందుకు శాటిలైట్ బస్ స్టేషన్ల నుంచి ప్రతి మూడు నిముషాలకు ఒక బస్సును ఏర్పాటు చేసినట్టు ఆర్టీసీ ఇన్‌ఛార్జ్ ఎండి హోదాలో ఉన్న సాంబశివరావు తెలియచేశారు.

విలేఖర్లతో మాట్లాడుతున్న డిజిపి సాంబశివరావు