తెలంగాణ

కోర్టును ఆశ్రయించిన వారి భూముల జోలికి వెళ్లం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 11: మెదక్ జిల్లా మల్లన్నసాగర్ ప్రాజెక్టు కింద భూములను సేకరించరాదని జీవో 123ను సవాలు చేస్తూ కోర్టులో పిటిషన్ దాఖలుచేసిన వారి భూముల జోలికి వెళ్లమని తెలంగాణ ప్రభుత్వం హైకోర్టుకు తెలియచేసింది. గురువారం ఈ అంశంపై హైకోర్టు విచారణ ప్రారంభమైంది. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ కె రామకృష్ణారెడ్డి వాదనలు వినిపిస్తూ, దేశంలో ఏ రాష్ట్రప్రభుత్వం కూడా 2013 భూసేకరణ చట్టాన్ని అమలు చేయడం లేదని పేర్కొన్నారు. పిటిషనర్లు 2013 చట్టం కిందనే నష్టపరిహారం కావాలని కోరితే, ఈ చట్టం కిందనే భూములను ప్రభుత్వం సేకరిస్తుందన్నారు. అనంతరం హైకోర్టు ఈ కేసు విచారణను వాయిదా వేసింది.