తెలంగాణ

ప్రమాదాల నివారణకు పటిష్ఠ చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 11: ప్రమాదాలు ఎక్కువగా జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులపైనే జరుగుతున్నందున ఈ రోడ్లకు వంద మీటర్ల లోపు మద్యం దుకాణాలకు అనుమతి ఇవ్వకుండా చట్ట సవరణ చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి తెలిపారు. గురువారం జరిగిన 30వ రోడ్డు భద్రతా కౌన్సిల్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులపై ప్రమాదాలకు మద్యం కూడా ప్రధానమైన కారణమని, వంద మీటర్ల లోపు మద్యం దుకాణాలు ఉండకుండా గతంలో కౌన్సిల్ తీర్మానం చేసిందని, ఈ మేరకు చట్ట సవరణ చేయనున్నట్టు మంత్రి తెలిపారు. జాతీయ, రాష్ట్ర రహదారుల వెంబడి ఉన్న బెల్టు షాపులను ఉపేక్షించవద్దని, కఠినంగా వ్యవహరించాలని మంత్రి ఆదేశించారు. కేరళ తరహాలో వేగ నియంత్రణ కోసం విధానాలు అమలు చేసేందుకు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలో పైలట్ ప్రాజెక్టు చేపట్టాలని మంత్రి చెప్పారు. ప్రమాదాలు జరిగినప్పుడు గోల్డన్ అవర్ ప్రిన్సిపుల్‌తో ప్రాణరక్షణకు అవసరమైన తక్షణ వైద్యం కోసం ప్రభుత్వ ఆస్పత్రులను సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల తరహాలో తీర్చిదిద్దనున్నట్టు చెప్పారు. ప్రైవేటు ఆస్పత్రులు తప్పనిసరిగా చికిత్స అందించే విధంగా ఆరోగ్యశ్రీని విస్తరించనున్నట్టు తెలిపారు.
జాతీయ రహదారులు ఉన్న 50 పోలీస్ స్టేషన్లకు ప్రత్యేకంగా పెట్రోలింగ్ వాహనంతో పాటు వీరికి 108 తరహాలో ప్రత్యేకంగా ట్రామాకేర్ అంబులన్స్‌లను సమకూర్చనున్నట్టు మంత్రి తెలిపారు. రాష్ట్రంలో మద్యం సేవించి వాహనాలు నడిపిన వారిపై ఎనిమిది లక్షల కేసులు, వేగంగా వాహనాలను నడిపిన వారిపై 12లక్షల కేసులు, హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపిన వారిపై నాలుగు లక్షల కేసులు నమోదు చేసినట్టు అధికారులు తెలిపారు.

చిత్రం..రోడ్డు భద్రత కౌన్సిల్ సమావేశంలో రవాణా మంత్రి మహేందర్‌రెడ్డి