రాష్ట్రీయం

ఇసుకకోసం ఇక్కట్లు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమండ్రి, నవంబర్ 29: ఇసుక విధానాన్ని పూర్తిగా మార్చి గతం మాదిరిగా బహిరంగ వేలం విధానాన్ని అమలుచేయాలని అధికశాతం మంది కోరుతున్నారు. ఇసుకపై శే్వతపత్రాన్ని విడుదలచేసిన సందర్భంగా జనవరి 1 నుండి కొత్త ఇసుక విధానాన్ని అమలుచేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించిన నేపథ్యంలో బహిరంగ వేలం విధానమైతేనే ప్రజలకు ప్రయోజనం కలిగిస్తుందని అన్ని వర్గాల ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఇసుక ర్యాంపుల లీజుదారులతో అధికార యంత్రాంగం కుమ్మక్కవటంవల్ల బహిరంగ వేలం విధానంలో అక్రమాలు చోటుచేసుకున్నాయని, అలాంటి అక్రమాలకు తావులేని నిబంధనలతో కూడిన బహిరంగ వేలం విధానాన్ని అమలుచేయాలని నిర్మాణ రంగ నిపుణులు కోరుతున్నారు. బహిరంగ వేలం విధానం అమలులో ఉన్నపుడు రెండు యూనిట్ల ఇసుక ధర వినియోగదారుడికి చేరిన తరువాత రూ.1800 ఉండేది. వినియోగదారుడి వద్దకు ఎక్కువ దూరం తీసుకెళ్లాల్సి వచ్చినపుడు దూరాన్ని బట్టి ధర మరింత పెరిగేది. కానీ ప్రస్తుతం అమలుచేస్తున్న విధానంలో రెండు యూనిట్ల ఇసుక ధర ర్యాంపులోనే రూ.5వేలు పలుకుతుంటే, దీనికి అదనంగా పరిస్థితులను బట్టి రవాణా, ఇతర ఖర్చులు వినియోగదారుడిపై పడుతున్నాయి. పోనీ ఇంత చెల్లించినా ఇసుక లభిస్తుందా అంటే, మీ సేవ కేంద్రంలో సొమ్ము చెల్లించిన తరువాత 20 రోజులకు కూడా లభించటం లేదు. దళారులకు రెండు యూనిట్ల ఇసుకకు రూ.6 వేలు లేదా రూ.8 వేలు చెల్లిస్తే మాత్రం వేగంగా ఇసుక లారీ ఇంటి ముందుకొచ్చి వాలుతోంది. విసుగెత్తిపోయిన వినియోగదారులు పాత విధానంలో బహిరంగ వేలాన్ని కోరుకుంటున్నారు. అయితే బహిరంగ వేలంలో ర్యాంపుల లీజుదారులు అడ్డగోలు తవ్వకాలు చేస్తుండటంతో ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం రావటం లేదు. ప్రస్తుత విధానంలో మహిళా పొదుపు సంఘాల పర్యవేక్షణలో నిర్వహిస్తున్న విధానంలో సర్కారుకు గతం కన్నా ఆదాయం బాగా పెరిగింది. సర్కారుకే కాదు, రాజకీయ పలుకుబడి ఉన్న వారి ఆదాయం కూడా బాగా పెరిగింది. కానీ వినియోగదారులు బాగా నష్టపోయారు. అందువల్ల రెండింటినీ బేరీజు వేసుకుంటే లోపాలు సరిదిద్దటం ద్వారా బహిరంగ వేలం విధానాన్ని అమలుచేస్తేనే ప్రజలకు లాభం కలుగుతుందని నిర్మాణ రంగ నిపుణులు సూచిస్తున్నారు. బహిరంగ వేలం విధానంలో కూడా ధరను ప్రభుత్వమే నిర్ణయించే విధంగా స్పష్టమైన నిబంధన ఉండాలని, సాధ్యమైనన్ని ఎక్కువ ర్యాంపులను తెరవాలని నిపుణులు సూచిస్తున్నారు. సరఫరాను పెంచేందుకు చర్యలు తీసుకోవటం ద్వారా ఇసుక మాఫియా ఆటలు కట్టించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. గోదావరి, కృష్ణా వంటి పెద్ద నదుల్లో మాత్రమే ఇసుక తవ్వకాలకు వేలం నిర్వహించి, వాగులు, వంకల్లోని ఇసుకను నిర్ధిష్ట నియంత్రణ మధ్య ఉచితంగా అందిస్తే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.