తెలంగాణ

ప్రపంచ బ్యాంకు పథకాలు మిషన్ భగీరథకు అనుసంధానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 16: ప్రపంచ బ్యాంకు నిధులతో చేపట్టిన తాగునీటి పథకాలను మిషన్ భగీరథతో అనుసంధానించాలని పంచాయితీరాజ్ స్పెషల్ చీఫ్‌సెక్రటరీ ఎస్పీ సింగ్ అధికారులకు ఆదేశించారు. ఆదిలాబాద్, కరీంనగర్, మహబూబ్‌నగర్, జిల్లాల్లో వరల్డ్ బ్యాంకు నిధులతో చేపట్టిన తాగునీటి పథకాల పురోగతిపై సచివాలయంలో ఎస్‌పి సింగ్ చర్చించారు. ప్రపంచ బ్యాంకు నిధులతో ఇప్పటికే 810 సింగిల్ విలేజ్ స్కీమ్‌లు, 26 మల్టీ విలేజ్ స్కీమ్‌లలో 50 కోట్ల రూపాయలతో అదనంగా చెపట్టిన పనుల పురోగతిపై సమీక్షించారు. ప్రతి ఇంటికీ నల్లా కనెక్షన్ ఇవ్వడంతో పాటు హెడ్ వర్క్స్ చుట్టూ కంపౌండ్ వాల్స్‌ను నిర్మించాలని చెప్పారు. ఈ పనులన్నీ సెప్టెంబర్‌లో పూర్తి కావాలని ఆదేశించారు. సింగిల్ విలేజ్ స్కీమ్‌ల నిర్వాహణ బాధ్యతలను గ్రామ తాగునీటి, పారిశుద్ధ్య కమిటీలకు అప్పగించాలని ఎస్‌పి సింగ్ తెలిపారు. మల్టీ విలేజ్ స్కీమ్‌ల నిర్వాహణ కోసం సమగ్రమైన విధానాన్ని రూపొందించాలని చెప్పారు.