తెలంగాణ

ప్రాజెక్టులపై కాంగ్రెస్ ‘సినిమా’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 16: నీటి పారుదల ప్రాజెక్టులపై ప్రభుత్వం చెప్పిన లెక్కలన్నీ అవాస్తవాలేనని ఎండగట్టేందుకు కాంగ్రెస్ పార్టీ బుధవారం (17న) పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేందుకు సమాయత్తమైంది. బంజారాహిల్స్‌లోని లోటస్ పాండ్ వద్ద ఉన్న రావి నారాయణ రెడ్డి మెమోరియల్ హాలులో టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. దీనికి 150 స్లైడ్లను సిద్ధం చేశారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ముగింపు సందర్భంగా ముఖ్యమంత్రి కెసిఆర్ నీటిపారుదల ప్రాజెక్టులపై సభలోనే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచే కాంగ్రెస్ పార్టీ నాయకులు తామూ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి ప్రభుత్వాన్ని ఎండగడతామని చెప్పారు. 10 రోజుల క్రితం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేందుకు సన్నాహాలు చేసినా, ఉత్తమ్‌కుమార్ రెడ్డి అస్వస్థతకు గురి కావడంతో వాయిదాపడింది. ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఇవ్వనున్న ప్రజెంటేషన్‌లో 1956 నుంచి 2014 వరకు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఏయే ప్రాజెక్టులకు ఏ మేరకు నిధులు కేటాయించిందో వివరించనున్నారు. ఎన్ని ప్రాజెక్టులను పూర్తి చేసిందో, ఇంకా ఎన్ని పూర్తి కావాల్సి ఉందో కూడా స్పష్టం చేయనున్నది. టిఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కోటి ఎకరాలకు నీరు ఇస్తామని ప్రకటించి, ఒక్క ఎకరాకు నీరు ఇవ్వలేదని స్లైడ్స్ ద్వారా చూపించనున్నారు.