తెలంగాణ

హైదరాబాద్‌లో వీధిబాలలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 17: హైదరాబాద్ నగరంలో వీధి బాలల వ్యవహారం మరో మారు వివాదాస్పదం అవుతోంది. హైదరాబాద్‌లో వీధి బాలలు లేరని మున్సిపల్ కార్పొరేషన్ వాదిస్తుండగా, ఉన్నారని సేవ్ ద చైల్డ్ అనే స్వచ్ఛంద సంస్థ తేల్చి చెప్పింది. హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాల్లో సర్వే నిర్వహించిన ఈ సంస్థ 150 వార్డుల పరిధిలో 28,560 మంది వీధి బాలలు ఉన్నట్టు గుర్తించింది. దీంతో ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ జిహెచ్‌ఎంసికి నోటీసులు ఇచ్చింది. 28,560 మంది పిల్లలు రోడ్ల మీద ఉండే పరిస్థితి అభ్యంతరకరమని కమిషన్ పేర్కొంది. వీధి బాలల్లో 39 శాతం వరకూ అమ్మాయిలే ఉన్నట్టు లెక్క తేల్చారు. వీరి వౌలిక ప్రాధమిక హక్కులైన ఆహారం , విద్య, వైద్యం, గౌరవప్రదమైన జీవనం గురించి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో తమకు సెప్టెంబర్ 15లోగా చెప్పాలని బాలల హక్కుల కమిషన్ జిహెచ్‌ఎంసి కమిషనర్‌ను కోరిందని కమిషన్ సభ్యుడు అచ్యుతరావు తెలిపారు.