తెలంగాణ

కృష్ణమ్మ ఒడిలో భక్తకోటి స్నానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, ఆగస్టు 20: కృష్ణా పుష్కరాల్లో భాగంగా కృష్ణమ్మ ఒడిలో భక్తకోటి జనం పుణ్యస్నానాలు చేశారు. కృష్ణా పుష్కరాలు ప్రారంభమై తొమ్మిదవ రోజునాటికి ఒక్క మహబూబ్‌నగర్ జిల్లాలోనే కృష్ణా పుష్కరాల్లో కోటి మందికిపైగా భక్తులు పుణ్యస్నానం చేసి పునీతులయ్యారు. పుష్కరాల్లో భాగంగా శనివారం దారులన్ని పరుగెత్తాయి. దింతో 44 జాతీయ రహదారిపై వాహనాల రద్ది ఏర్పడింది. పెబ్బేరు, భూత్పుర్, జానంపేట, ఎర్రవల్లి, అలంపూర్ చౌరస్తాల్లో ట్రాఫీక్ అంతరాయం ఏర్పడింది. కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో భక్తులు ఇక్కట్లకు గురయ్యారు. రహదారిపై ట్రాఫీక్ రద్ది పెరగడంతో ఒక్కసారిగా అధికారులు ఉలిక్కిపడ్డారు. అప్రమత్తమైన అధికార యంత్రాంగం రోడ్లపైకి వచ్చి వాహనాల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నప్పటికిని రోడ్లపైనే గంటలతరబడి భక్తులు నిరిక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది. బీచుపల్లి, అలంపూర్, సోమశిల, రంగాపూర్ ఘాట్లకు ఒకేరోజు 14 లక్షలకుపైగా మంది భక్తులు ఈ ఘాట్లలో పుణ్యస్నానాలు చేశారు. అధికారులు వేసుకున్న అంచనాలను తలకిందులు చేసి భక్తులు తరలిరావడంతో కృష్ణమ్మ పులకించిపోయింది. భక్తజనకోటి మంది పుణ్యస్నానాలు చేయడం కృష్ణా పుష్కరాల్లో ఇదో చారిత్రత్మకగట్టం. ఐదవశక్తిపీఠం జోగులాంబ పుణ్యక్షేత్రంలో రాష్ట్ర గవర్నర్ నరసింహన్, కేంద్రమంత్రి దత్తాత్రేయలతో పాటు పలువురు ప్రముఖులు పుణ్యస్నానాలు చేసి జోగులాంబ అమ్మవారిని దర్శించుకున్నారు. అలంపూర్ పుణ్యక్షేత్రంలో కొనసాగుతున్న యాగంలో సైతం వారు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. జోగులాంబ దర్శనం కోసం లక్షలాది మంది భక్తులు తరలిరావడంతో అలంపూర్ భక్తజనసందోహంగా మారింది. అలంపూర్ పుణ్యక్షేత్రానికి తెలంగాణ, ఆంద్ర, రాయలసీమ, కర్ణాటక, మహరాష్టల్రకు చెందిన లక్షాలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. సప్తసంగమం ద్వాదశ జ్యోతిర్లింగాలుగా భక్తులు పిలవబడే సోమశిల పుష్కర ఘాట్‌కు ఒకేరోజు దాదాపు 4లక్షల మంది భక్తులు పుణ్యస్నానాలు చేశారు. అయితే భక్తుల రద్ది మరింత పెరగడంతో మంచాలకట్ట పుష్కర ఘాట్‌కు భక్తులను మళ్లించారు. బీచుపల్లి, రంగాపూర్ పుష్కర ఘాట్లలో జనం కిక్కిరిసిపోయి ఘాట్లన్ని కిటకిటలాడాయి. ఏది ఎమైనప్పటికిని కృష్ణా పుష్కరాల్లో భాగంగా మహబూబ్‌నగర్ జిల్లాలోనే కోటి మందికిపైగా భక్తులు ఇక్కడ పుణ్యస్నానం చేసి పునితులయ్యారు.
జోగులాంబ ఆలయంలో
నేడు విఐపి దర్శనాలు బంద్
కృష్ణాపుష్కరాల రద్దీ దృష్ట్యా ఆదివారం మధ్యాహ్నం 12గం.లవరకు విఐపి దర్శనాలు నిలిపివేశారు. ఈ మేరకు ఐజి శ్రీనివాస్‌రెడ్డి శనివారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు.

చిత్రం.. గద్వాల డివిజన్ పరిధిలోని నదిఅగ్రహారం వద్ద
పుష్కరస్నానం ఆచరించేందుకు వచ్చిన భక్తజనం