ఆంధ్రప్రదేశ్‌

పాడి పరిశ్రమకు మంచిరోజులు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, ఆగస్టు 21: సక్రమమైన, ప్రణాళికాయుతమైన పశు పోషణ ద్వారా పాడి పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం మార్గం సుగమం చేస్తోంది. రాష్ట్రంలో వ్యవసాయం, పశుపోషణలో అగ్రభాగాన ఉండే తూర్పు గోదావరి జిల్లాలో కొంతకాలంగా పశు సంరక్షణపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఆ పరిస్థితుల నుండి జిల్లాను గట్టెక్కించడానికి ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. రెండంకెల ఆర్థిక ప్రగతి సాధించాలంటే పాడి పరిశ్రమ ప్రగతి కూడా కీలకమేనని, ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. వ్యవసాయం, పాడి పరిశ్రమలు రెండు కళ్లుగా భావించే తూర్పు గోదావరి జిల్లాలోని ఔత్సాహితులను ప్రోత్సహించాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. ఈ జిల్లాలో క్షీరసాగర్ పథకానికి అధిక ప్రాధాన్యతనివ్వాలని ప్రభుత్వం స్పష్టంచేసింది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో క్షీరసాగర్ పథకం కింద జిల్లాకు వెయ్యి యూనిట్లు మంజూరుచేశారు. అలాగే పెయ్య దూడల పెంపకం కోసం సునందిని అనే పథకాన్ని అమలుచేయనున్నారు. సునందిని పథకం కింద పెయ్యి దూడలకు బీమా కల్పించడంతో పాటు దాణా, మందులను ఉచితంగా పంపిణీచేస్తారు. పట్టణ ప్రాంతాల్లో పశుపోషకులను ప్రోత్సహించడానికి దాణా బజార్లు ఏర్పాటుచేయనున్నారు.
నగర, పట్టణ ప్రాంతాల్లో పాడి పశుపోషణను ప్రోత్సహించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా పశు సంవర్ధక శాఖను ప్రభుత్వం ఆదేశించింది. జిల్లాలో పశువుల దాణా కేంద్రాలు ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. జిల్లాలో 42 పశు దాణా కేంద్రాల ఏర్పాటుకు రూ.1.05 కోట్లను వెచ్చించనున్నారు. పెద్దాపురం మండలం తిరుపతి గ్రామంలో దాణా తయారీ కేంద్రాన్ని ఏర్పాటుచేస్తుండగా, మరో 41 కేంద్రాలను వివిధ మండలాల్లో ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారు. రూ.44.39 లక్షల వ్యయంతో గోపాలమిత్ర కేంద్రాల ఏర్పాటు, పశువుల ఆసుపత్రుల్లేని గ్రామాల్లో గోపాలమిత్రలచే వైద్యం, కృత్రిమ గర్భధారణ ఇంజక్షన్లు, ఇతర పరీక్షల నిర్వహణకు ప్రాధాన్యతనిస్తున్నారు. 450 పశువుల బోన్లు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారు. 72 లక్షల వ్యయంతో పాడి పశువుల్లో జలగ నివారణ మందును ఉచితంగా రెండు డోసులుగా ఇస్తున్నారు. మొదటి విడతగా రూ.1.50 లక్షలతో పశువులకు జలగల నివారణ మందు అందజేసే పనిలో పశు సంవర్ధక శాఖాధికారులున్నారు. అలాగే జిల్లాలో ఊరూరా పశుగ్రాస క్షేత్రాలు పథకాన్ని కూడా అమలుచేసే పనిలో అధికారులున్నారు.