ఆంధ్రప్రదేశ్‌

టెక్నాలజీ వల్లే విజయవంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 21: సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రతిభావంతంగా వినియోగించుకుని కృష్ణా పుష్కరాలను ప్రశంసనీయంగా నిర్వహించగలిగామని, అదే స్ఫూర్తితో ‘రియల్ టైమ్స్ గవర్నెన్స్’ టెక్నాలజీ ద్వారా రాష్ట్రానికి సుపరిపాలన అందించాలని సంకల్పించామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఆదివారం మధ్యాహ్నం దుర్గాఘాట్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌లో ప్రభుత్వ కార్యదర్శులు, కలెక్టర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కృష్ణా పుష్కరాల నిర్వహణకు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తూ లక్షల మంది యాత్రికులు పుష్కర స్నానాలకు వస్తున్నా ఎవరికీ ఎటువంటి ఇబ్బంది కలుగకుండా ప్రభుత్వ యంత్రాంగం నిర్వహించగలిగిందని తెలిపారు. ఘాట్‌లలో రద్దీని, రోడ్లపై ట్రాఫిక్‌ను అద్భుతంగా నియంత్రించగలిగారన్నారు. పుష్కరాల నిర్వహణ పట్ల సంతృప్తి చెందిన ప్రజలు ప్రశ్నించే స్థాయి నుంచి ప్రభుత్వాన్ని ప్రశంసించే స్థాయికి వచ్చారన్నారు. ఇదంతా కమాండ్ అండ్ కంట్రోల్ ఏర్పాటు చేసిన సాంకేతిక పరిజ్ఞానంతోనే సాధ్యమైందన్నారు. గోదావరి పుష్కరాల్లో తొలి రోజున ఘాట్ వద్ద సరైన నియంత్రణ లేని కారణంగా జరిగిన తొక్కిసలాటలో 30 మంది మరణించిన సంఘటన తనకు నేటికీ కళ్ల ముందు గుర్తుకొస్తుందన్నారు. నాడు అధికారులు వద్దని వారించినా బాధిత కుటుంబాలకు వెళ్లి ఓదార్చటం జరిగిందన్నారు. నేడు కృష్ణా నదిలో లక్షలాది భక్తులు ఉల్లాసంగా ఉత్సాహంగా భక్తిశ్రద్ధలతో కృష్ణమ్మకు నీరాజనాలు పలికారన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 5.06 లక్షల వీధిలైట్లకు సెన్సార్లను ఏర్పాటు చేసి ఒకే బటన్‌తో అన్ని లైట్లు వెలిగేలా, ఆఫ్ చేసేలా కొత్త టెక్నాలజీని అమలు చేస్తున్నామన్నారు. పుష్కరాల్లో నిర్వహించినట్లే ప్రభుత్వ కార్యక్రమాలను రియల్ టైమ్స్ గవర్నెన్స్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ పరిపాలన కొనసాగించినట్లైతే ప్రజలకు మరింత ప్రతిభావంతమైన, వేగవంతమైన పరిపాలనను అందించగలమన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులందరూ కమాండ్ సెంటర్‌లో నిర్వహిస్తున్న పరిజ్ఞానాన్ని పరిశీలించాల్సిందిగా ఆదేశించారు. పుష్కరాల్లో అధికారులు, ఉద్యోగుల పనితీరుతో పాటు వారి ఆలోచనల్లో సమర్థత కనిపించిందన్నారు. ఎంతో ఉత్సాహంతో, బాధ్యతతో పని చేశారన్నారు. ఈ నెల 24వ తేదీ నుంచి రాష్ట్ర పరిపాలన సాధారణంగా సాగుతుందని సిఎం అన్నారు. పుష్కర ప్రత్యేకాధికారి రాజశేఖర్ మాట్లాడుతూ ఒకే రోజు కోటి మంది యాత్రికులు వచ్చినా ప్రశాంతంగా స్నానాలు చేసేలా ఘాట్‌లను రూపొందించడం జరిగిందన్నారు. గోదావరి పుష్కరాలకు 50వేల చదరపు మీటర్ల ఘాట్‌లు ఉపయోగించగా ఇక్కడ లక్షా, 40వేల చదరపు మీటర్ల ఘాట్‌లను ఏర్పాటు చేశామన్నారు.
డిజిపి నండూరి సాంబశివరావు మాట్లాడుతూ ఆర్టీసీలో బస్సులకు జిపిఎస్ సిస్టమ్ ఏర్పాటు చేసి మంచి ఫలితాలను సాధించామని, అదే విధంగా పోలీసు వ్యవస్థలో ఆధునిక సాంకేతికతను వాడుకుంటూ శాంతిభద్రతలను మెరుగుపరుస్తామని తెలిపారు. కృష్ణా జిల్లా కలెక్టర్ బాబు ఎ మాట్లాడుతూ పుష్క ర విధుల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా 60 వేల మంది విధులు నిర్వర్తిస్తున్నారని తెలిపారు. మైక్రోసాఫ్ట్ ప్రతినిధులు రియల్ టైమ్స్ గవర్నెన్స్ యాప్ గురించి వివరించారు. ఈ సమావేశంలో రాష్ట్ర హోం శాఖమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్‌పి టక్క ర్, ఐటి అడ్వైజర్ జె సత్యనారాయణ, జిల్లా కలెక్టర్లు, వివిధ శాఖల కార్యదర్శులు పాల్గొన్నారు.
కలెక్టర్లు, కార్యదర్శుల సమావేశంలో మాట్లాడుతున్న చంద్రబాబు