తెలంగాణ

‘2013’ ప్రకారమే భూసేకరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 22: 2013 చట్టం ప్రకారం భూ సేకరణ చేయాలని హైకోర్టు తెలంగాణ సర్కార్‌ను సోమవారం నాడు ఆదేశించింది. ఈతీర్పు హైకోర్టును ఆశ్రయించిన 70 మంది మల్లన్నసాగర్ రైతులకు ఊరట కలిగించింది. కోర్టును ఆశ్రయించిన రైతులకు పరిహారం చెల్లించాలని కూడా హైకోర్టు స్పష్టం చేసింది. అలాగే కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే బుధవారానికి వాయిదా వేసింది. నేషనల్ ఇనె్వస్ట్‌మెంట్ అండ్ మానుఫ్యాక్చరింగ్ జోన్ కింద పరిహారం ఇవ్వాలని పేర్కొంటూ ఇచ్చిన జీవోలు నీటిపారుదల ప్రాజెక్టులకు భూములు ఇస్తున్న రైతులకు, వ్యవసాయ కార్మికులకు వర్తించదని హైకోర్టు స్పష్టం చేసింది. జీవో 123 సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాధ్, జస్టిస్ యు దుర్గాప్రసాదరావులతో కూడిన డివిజన్ బెంచ్ విచారిస్తూ ఈ ఆదేశాలు ఇచ్చింది.
పిఆర్‌ఆర్ ఎత్తిపోతలపై స్టే
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం రీడిజైనింగ్‌కు నిర్వహిస్తున్న సర్వేపై రాష్ట్ర హైకోర్టు స్టే విధించింది. తదుపరి ఆదేశాలు ఇచ్చేంత వరకూ సర్వేను నిలిపివేయాలని హైకోర్టు రెవిన్యూ అధికారులను ఆదేశించింది. ఎం నాగజ్యోతి సహా 40 మంది రైతులు దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ సురేష్‌కుమార్ కైత్ విచారించి ఈ ఆదేశాలు ఇచ్చారు.