తెలంగాణ

డబుల్ బెడ్ రూం ఇళ్లకు బోలెడు మినహాయింపులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 22: పట్టణ పేదల సొంతింటి కలను నిజం చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. రాష్టవ్య్రాప్తంగా 2లక్షల డబుల్ బెడ్ రూం ఇళ్లను నిర్మించాలని నిర్ణయించుకున్న ప్రభుత్వం ఒక్క హైదరాబాద్‌లోనే లక్ష డబుల్ బెడ్ రూం ఇళ్లను నిర్మించనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే! ఇప్పటికే ఐడిహెచ్ కాలనీలో 386 మోడల్ ఇళ్లను నిర్మించి లబ్దిదారులకు ఇచ్చిన ప్రభుత్వం తొలి దశగా జిహెచ్‌ఎంసి పరిధిలో 25వేల డబుల్ బెడ్ రూం ఇళ్లను నిర్మించే దిశగా చర్యలను ముమ్మరం చేసింది. అన్ని రకాల అడ్డంకులను తొలగించుకున్న ప్రభుత్వం ఇందుకు ప్రధానమైన భవన నిర్మాణ విధి విధానాల్లోనూ పలు మినహాయింపులు చేసింది. తక్కువ స్థలంలో ఎక్కువ అంతస్తులు, నిర్మాణ వ్యయం భారం కాకుండా ఉండేందుకు వీలుగా డెవలప్‌మెంట్, పార్టనర్‌షిప్ వంటి విధానాలను పరిశీలిస్తున్న ప్రభుత్వం, ప్రస్తుతం సాధారణంగా భవన నిర్మాణాలకు అమలు చేస్తున్న విధివిధానాలు కాకుండా, అందులోనే సెట్‌బ్యాక్‌లు, అంతస్థులు, రోడ్లు, కనీస వసతులు వంటి అంశాలకు సంబంధించి పలు మినహాయింపులు కావాలంటూ కొద్ది రోజుల క్రితం జిహెచ్‌ఎంసి ముఖ్యమంత్రికి పంపిన ప్రతిపాదనలను కెసిఆర్ ఆమోదించారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు రేపోమాపో జిహెచ్‌ఎంసికి రానున్నట్లు అధికారులు తెలిపారు.
ప్రస్తుతం అమలులో ఉన్న విధివిధానాలను కచ్చితంగా అమలుచేస్తే మురికివాడల్లో డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణానికి అనేక రకాల ఇబ్బందులు తలెత్తుతాయి. జి ప్లస్ 4 అంతస్తులు మొదలుకుని జి ప్లస్ 7, 9, 10, 14 వరకు కూడా నిర్మించాలన్న సిఎం సూచన మేరకు జిహెచ్‌ఎంసి అధికారులు తమకు కావల్సిన మినహాయింపులు, ప్రస్తుతమున్న నిబంధనల సడలింపులకు సంబంధించి ప్రతిపాదనలు పంపించారు.
బ్‌హుళ అంతస్తు భవనాల నిర్మాణానికి కనిష్ఠంగా 2వేల చదరపు మీటర్ల స్థలం ఉండాలి. కానీ 2బిహెచ్‌కె ఇళ్లకోసం ఈ నిబంధనను వెయ్యి చదరపు మీటర్లకు కుదించాలి.
జ్ ప్లస్ 14 అంతస్తుల భవనాన్ని నిర్మిస్తే ఇరువైపులా 24 మీటర్ల వెడల్పుతో రోడ్డును ఏర్పాటు చేయాల్సి ఉంది. ఈ రోడ్ల వెడల్పును 9 మీటర్లకే పరిమితం చేస్తారు.
క్‌నీస సెట్‌బ్యాక్‌లు ముందు 13 మీటర్లు, ఇతరవైపులా ఒక్కో బ్లాకుకు మధ్య కనీసం 13 మీటర్ల గ్యాప్ ఉండాల్సి ఉండగా, దీన్ని ఆరు మీటర్లకు కుదిస్తారు.
బ్‌హుళ అంతస్తు భవనాలు నిర్మించే మొత్తం స్థలంలో కనీసం 33శాతం పార్కింగ్‌కు కేటాయించాలన్న నిబంధన ఉండగా, డబుల్ బెడ్ రూం భవనాల ఆవరణల్లో 15 శాతం పార్కింగ్‌కు కేటాయిస్తారు.
న్‌ర్మాణం చేపట్టే స్థలంలో కనీసం పది శాతం టాట్-లట్‌కు కేటాయించాలి. ఈ భవనాలకు 5 శాతానికే కుదించనున్నారు.
మ్‌నహాయింపులతో నిర్మించే ఈ భవనాలకు ఫైర్ క్లియరెన్స్ నిబంధనను మినహాయించనున్నారు. దీంతోపాటు సివిల్ ఏవియేషన్ క్లియరెన్స్ కూడా ప్రభుత్వం సమకూర్చాలని కోరింది.