తెలంగాణ

రూ. 480 కోట్లతో పర్యాటకాభివృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగార్జునసాగర్, ఆగస్టు 22: ఈ సంవత్సరం తెలంగాణ రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని రూ.480కోట్లతో అభివృద్ధిపరుస్తున్నామని తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్, మాజీ డిజిపి పేర్వారం రాములు అన్నారు. నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్‌లో కుటుంబ సమేతంగా పుష్కర స్నానం ఆచరించడానికి ఆయన ఆదివారం సాగర్‌కు చేరుకున్నారు. సోమవారం ఉదయం నాగార్జునసాగర్‌లోని శివాలయ పుష్కరఘాట్‌లో కుటుంబ సభ్యులతో పుష్కర స్నానం ఆచరించి స్థానిక శివాలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ గత పాలకులు రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో పర్యాటకాన్ని అభివృద్ధి చేయడానికి సంవత్సరానికి రూ.120కోట్లు మాత్రమే కేటాయించేవారని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటయిన తరువాత ఈసంవత్సరం రూ. 480 కోట్లతో కొత్తగా ఏర్పడనున్న జిల్లాలను దృష్టిలో పెట్టుకోని పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తున్నామన్నారు. దీనిలో భాగంగా నల్లగొండ జిల్లాలోని మల్లెపల్లి వద్ద త్వరలోనే హరిత హోటల్‌ను ప్రారంభిస్తున్నామన్నారు. రూ.15కోట్లతో కొత్తగూడెం వద్ద హోటల్‌ను, కినె్నరసాని వద్ద జంతు ప్రదర్శన శాల, లాంలు, వాటర్ స్పోట్స్‌ను ఏర్పాటుచేస్తున్నామని తెలిపారు. రూ.7కోట్లతో నల్లగొండ జిల్లాలో భువనగిరి కోట వద్ద విదేశి సాంకేతికతో కేబుల్‌కార్న్‌ను ఏర్పాటుచేస్తున్నామన్నారు. భువనగిరి కోట ప్రపంచంలోనే రెండవ ఏకశిలకోట అని దానిని అంతర్జాతీయంగా పర్యాటకంగా అభివృద్ధి చేయడానికి టూరిజం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పర్యాటకరంగాన్ని ఆకర్షించే విధంగా జలపాతాలను వెలుగులోకి తీసుకొచ్చి పర్యాటకులకు అందుబాటులోకి తెస్తామన్నారు. నిజామాబాద్ జిల్లాలో డాన్సింగ్ రాక్స్‌ను, భూపాలపల్లిలో పాండువుల గుహలను అభివృద్ధిపరచనున్నట్లు తెలిపారు. ఇప్పటికే నాగార్జునసాగర్‌లో ప్రత్యేక లాంచి, ఫ్లోటింగ్ జెట్టిని ఏర్పాటుచేశామని తెలిపారు.

చిత్రం..విలేఖరులతో మాట్లాడుతున్న తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పేర్వారం రాములు