తెలంగాణ

పుష్కరాల్లో విషాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లింగాల, ఆగస్టు 22: కృష్ణ పుష్కరాలు మరో ఒకరోజులో ముగియనుండగా మహబూబ్‌నగర్ జిల్లా కొల్లాపూర్ మండలంలోని అమరగిరి పుష్కరఘాట్‌లో అపశృతి దొర్లింది. కృష్ణానది నీటమునిగి హైదరాబాద్‌కు చెందిన ప్రైవేట్ ట్రావెల్‌కు చెందిన డ్రైవర్ మహేశ్ (35) మృతి చెందిన విషాదకరమైన సంఘటన సోమవారం చోటుచేసుకుంది.
పోలీసులు, పుష్కర భక్తులు తెలిపిన వివరాల ప్రకారం. హైదరాబాద్ చంద్రాయణగుట్ట ప్రాంతానికి చెందిన ఊదూద్ ట్రావెల్‌కు చెందిన స్వరాజ్ మజ్దార్ టూరిస్ట్ యందు హైదరాబాద్ నగరంలోని బండ్లగూడ ప్రాంతానికి చెందిన పుష్కర యాత్రీకులను ఎక్కించుకొని సోమవారం ఉదయం అమరగిరి పుష్కరఘాట్‌కు చేరుకున్నారు. ఈ టూరిస్టు యందు ప్రయాణించిన యాత్రీకులు పుష్కరఘాట్‌లో పుణ్యస్నానమాచరిస్తుండగా వారికి దగ్గరలోనే టూరిస్టు డ్రైవర్ మహేశ్(35) నదిలో స్నానం చేసేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు నీట మునిగిపోయాడు. గమనించిన చుట్టుపక్కల వారు అతన్ని ఒడ్డుకు తీసుకొని రాగా, అప్పటికి మృతి చెందినట్లు గుర్తించారు. మృతదేహాన్ని కొల్లాపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
మృతుడు నీటమునిగి చనిపోయాడా, లేక ఏదైనా అనారోగ్యంతో మృతి చెందాడా అనేది పోస్టుమార్టం నివేదిక ద్వారా తెలుస్తుందని వైద్యాధికారులు తెలిపారు. మృతునికి భార్య, పిల్లలు ఉన్నారు.

చిత్రం..అమరగిరిలో నీటమునిగి మృతి చెందిన మహేశ్ మృతదేహం