తెలంగాణ

గద్వాలలో ఆగ్రహ జ్వాలలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గద్వాల, ఆగస్టు 22: రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన సౌలభ్యం కొరకు కొత్త జిల్లాల ఏర్పాటులో అన్ని అర్హతలు ఉన్న మహబూబ్‌నగర్ జిల్లా గద్వాలకు న్యాయం చేయలేదంటూ గద్వాలలో ఆగ్రహ జ్వాలలు రగిలాయి. సోమవారం సాయంత్రం నుంచి పట్టణంలో నిరసన ర్యాలీలు, ముఖ్యమంత్రి దిష్టిబొమ్మకు శవయాత్ర, దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు. కొందరు గుర్తుతెలియని వ్యక్తులు అయిజ నుంచి గద్వాలకు వస్తున్న టిఎస్06యుఎ 4987 నంబర్ గల ఆర్టీసీ బస్సును పెట్రోల్ పోసి నిప్పంటించారు. డ్రైవర్ కోటేశ్వర్‌రెడ్డి, కండెక్టర్ జిఎస్‌రెడ్డిల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. కుర్వపల్లి స్టేజీ వద్ద ప్రయాణికుల మాదిరిగి ముందుడోరులో నలుగురు, వెనుకడోరులో ఇద్దరు ఎక్కారు. బస్సు కదిలిన వెంటనే వెనుక అద్దాలు ధ్వంసం చేశారు. వెంటనే బస్సును నిలిపివేయడంతో ప్రయాణికులు కిందకు సురక్షితంగా దిగగా వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ను బస్సులో చల్లి నిప్పంటించారు. ఈ ప్రమాదంలో బస్సు మొత్తం అగ్నికి ఆహుతైంది. ఈ విషయాన్ని తెలుసుకున్న సిఐ సురేష్, ఆర్టీసీ మేనేజర్ రవీందర్, ఎస్‌ఐలు సంఘటన స్థలానికి చేరుకొని అగ్నిమాపక సిబ్బందితో మంటలు ఆర్పించారు.
గద్వాలలో జరుగుతున్న నిరసన ఆగ్రహ జ్వాలలను దృష్టిలో ఉంచుకొని గద్వాల ఆర్టీసీ అధికారులు బస్సుల రాకపోకలను సోమవారం సాయంత్రం నుంచి నిలిపివేశారు. పుష్కరాల సందర్భంగా సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రయాణికులు బస్సుల కోసం బస్టాండ్‌కు చేరుకోగా పోలీసుల హెచ్చరికలతో బస్సులను నడపలేమని ప్రయాణికులకు సూచించారు. ఈ సందర్భంగా కర్నూల్ బస్సుకు కండెక్టర్ టికెట్‌ను కొట్టగా డబ్బులు వాపస్ ఇవ్వాలని ప్రయాణికులు గొడవకు దిగారు. అదేవిధంగా నదిఅగ్రహారం నుంచి రైల్వేస్టేషన్‌కు వెళ్లే బస్సులను కూడ బస్టాండ్‌లోనే నిలిపివేశారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొని ప్రైవేటు వాహనాలను, రైళ్లను ఆశ్రయించాల్సి వచ్చింది. సాయంత్రం రైల్వేస్టేషన్ వద్ద ప్రయాణికులు కిక్కిరిసి పోయారు.

చిత్రాలు..పూర్తిగా దగ్ధమైన ఆర్టీసీ బస్సు
* గద్వాల పాతబస్టాండ్‌లో సిఎం కెసిఆర్ దిష్టిబొమ్మతో రాస్తారోకో చేస్తున్న అఖిలపక్షం నాయకులు

సోమశిలలో పుష్కరఘాట్ వద్ద జనసందోహం