తెలంగాణ

వివాదం సమసింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 23: గోదావరి, ఉప నదుల విషయంలో ఉమ్మడి ఆంధ్రరాష్ట్రంతో నిత్యం ఘర్షణ వైఖరి ఉండేదని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ వ్యాఖ్యానించారు. ప్రత్యేక తెలంగాణ ఆవిర్భావం తరువాత రెండు రాష్ట్రాల కృషితో బలమైన స్నేహబంధం ఏర్పడిందన్నారు. తెలంగాణ సిఎం కెసిఆర్ తమతో స్నేహపూర్వక సంబంధాలు కొనసాగిస్తున్నారన్నారు. సామరస్య పూర్వకంగా ప్రాజెక్టుల నిర్మాణం కోసం ఒప్పందాలు చేసుకోవడం శుభపరిణామంగా ఫడ్నవీస్ అభివర్ణించారు. తక్కువ ముంపుతో ఎక్కువ నీటిని ఉపయోగించుకునేలా తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టులకు రీ-డిజైనింగ్ చేసిందని స్పష్టం చేశారు. ఈరోజు కుదిరిన ఒప్పందం వల్ల రెండు రాష్ట్రాల్లోని రైతులకూ మేలు జరుగుతుందన్నారు. ఈ ఒప్పందం వల్ల గోదావరి, ప్రాణహిత, పెన్‌గంగ జలాలను రెండు రాష్ట్రాల రైతులు ఉపయోగించుకొని వృద్ధిలోకి వస్తారన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఇరు రాష్ట్రాలకు ప్రయోజనం కలిగేలా చేసుకున్న ఒప్పందాలు సత్సంప్రదాయంగా ఫడ్నవీస్ కొనియాడారు. రాబోయే కాలంలోనూ రెండు రాష్ట్రాల మధ్య ఇదే విధమైన సహకార స్ఫూర్తి కొనసాగుతుందని అంటూనే, చారిత్రక ఘట్టంగా సాగిన ఈ ఒప్పందాలు రెండు రాష్ట్రాలకు మెరుగైన ఫలితాలు అందించాలన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఒప్పందాల అనంతరం రెండు రాష్ట్రాల మధ్య స్నేహానికి గుర్తుగా ఫడ్నవీస్‌ను చార్మినార్ ప్రతిమతో సిఎం కెసిఆర్ సత్కరిస్తే, మహారాష్ట్ర సిఎం ఫడ్నవీస్ వినాయకుడి ప్రతిమతో సిఎం కెసిఆర్‌ను సత్కరించారు.