తెలంగాణ

కలకాలం జలస్నేహం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 23: ‘నీటి కోసం రాష్ట్రాల మధ్య యుద్ధాలు జరుగుతున్న తరుణంలో తెలంగాణ- మహారాష్ట్ర ఇచ్చిపుచ్చుకునే ధోరణితో అంతరాష్ట్ర ప్రాజెక్టుల నిర్మాణాలు చేపట్టడం దేశానికే ఆదర్శం’ అని సిఎం కె చంద్రశేఖర్‌రావు వ్యాఖ్యానించారు. గోదావరి, దాని ఉప నదులపై నిర్మించబోయే ప్రాజెక్టులపై మహారాష్టత్రో ముంబయిలో మంగళవారం ఒప్పందం కుదుర్చుకున్న సందర్భంలో ఇద్దరు సిఎంలు సంయుక్తంగా మీడియాతో మాట్లాడారు. సిఎం కెసిఆర్ మాట్లాడుతూ ‘తెలంగాణ- మహారాష్ట్ర మధ్య కుదిరిన ఒప్పందం చారిత్రాత్మకం. సువర్ణాక్షరాలతో లిఖించదగ్గది. ఈ ఒప్పందం దేశంలో ఒక మంచి ఒరవడికి నాంది పలుకుతుంది’ అని వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రాజెక్టుల పట్ల మహారాష్ట్ర ప్రభుత్వం అందించిన స్నేహ హస్తానికి రాష్ట్ర ప్రజల తరఫున, వ్యక్తిగతంగా కృతజ్ఞతలు తెలిపారు. ఏడాదిన్నరగా నీటిపారుదల మంత్రి హరీశ్‌రావు ఎప్పటికప్పుడు మహారాష్టత్రో చర్చలు జరిపి విశేష కృషి చేసి ఫలితాలు సాధించారని సిఎం కెసిఆర్ ప్రశంసించారు. రెండు రాష్ట్రాల నీటిపారుదల మంత్రులు, అధికారులు పరస్పరం సహకరించుకుని, సందేహాలను నివృత్తి చేసుకోవడమే ఒప్పందానికి మార్గం సుగమమైందన్నారు. సముద్రం పాలవుతోన్న గోదావరిని రెండు రాష్ట్రాల రైతులకు అందించడమే లక్ష్యంగా ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టనున్నట్టు ప్రకటించారు. ఈ ఏడాది ఇప్పటికే 1400 టిఎంసి సముద్రం పాలైందని, ప్రాజెక్టులు నిర్మించివుంటే ఈ నీటితో రైతులకు మేలు జరిగి ఉండేదన్నారు. ఈపక్క గోదావరి సముద్రం పాలవుతుంటే, మరోపక్క నీళ్లులేక పొలాలు ఎండుతున్నాయన్నారు. ఈ పరిస్థితి రాకుండా ఉండేందుకే ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టినట్టు వెల్లడించారు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రాజెక్టులు ముందుకెళ్లకుండా పొరుగు రాష్ట్రాలతో సమస్యలను జటిలం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉమ్మడి ఆంధ్ర పాలనలో పొరుగు రాష్ట్రాలతో జగడాలు పెట్టుకుని ప్రాజెక్టులు కట్టికుండా వదిలేశారని విమర్శించారు. గతంలో ఇరు రాష్ట్రాల్లో, కేంద్రంలో ఒకే పార్టీ అధికారంలోవున్నా ఒప్పందం చేసుకోలేకపోయారని అంటూ, ప్రస్తుతం మూడుచోట్లా వేర్వేరు ప్రభుత్వాలున్నా ఒక్కమాటకు రాగలిగామని ఆనందం వ్యక్తం చేశారు. గోదావరి మాదిరిగానే కృష్ణా జలాల పంపిణీ విషయంలోనూ తెలంగాణ ఇరుగు పొరుగు రాష్ట్రాలతో స్నేహపూరిత వైఖరినే కొనసాగిస్తోందన్నారు. తెలంగాణ ఆవిర్భావం తరువాత ఇరుగు పొరుగుతో స్నేహబంధం కొనసాగిస్తూ జరిగిన నష్టాన్ని పూడ్చుకునే ప్రయత్నం చేస్తున్నట్టు కెసిఆర్ వెల్లడించారు. మాకు కావాల్సింది నీళ్లు తప్ప వివాదాలు కాదని, తాను ముంబయికి మొదటిసారి వచ్చినప్పుడే ఫడ్నవీస్ వద్ద ఈ విషయం ప్రస్తావించానన్నారు. సమైక్య రాష్ట్రంలో నీటిపారుదల రంగంలో తీవ్రంగా నష్టపోయామని, తెలంగాణ ఉద్యమం జరిగిందే నీళ్లు, నిధులు, నియామకాల కోసమన్నారు. ఎగువ రాష్ట్రానికి ముంపు సమస్య లేకుండా ప్రాజెక్టులకు రీ-డిజైనింగ్ చేశామన్నారు. తమ్మిడిహట్టి వద్ద 152 మీటర్ల ఎత్తులో ప్రాజెక్టు కడతామని సమైక్య ఆంధ్ర ప్రతిపాదించగా, దానికి మహారాష్ట్ర ప్రభుత్వం అంగీకరించలేదన్నారు. ఎత్తు తగ్గించడం ద్వారా మహారాష్టన్రు ఇప్పుడు ఒప్పించగలిగామని కెసిఆర్ స్పష్టం చేశారు