తెలంగాణ

కాంగ్రెస్ అధికారంలోకొస్తే.. మహా ఒప్పందాన్ని పునఃపరిశీలిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్ టౌన్, ఆగస్టు 23: తెలంగాణ రైతాంగం ఆత్మాభిమానాన్ని మహారాష్టక్రు తాకట్టు పెట్టి, మేడిగడ్డ నిర్మాణం కోసం చేసుకుంటున్న మహా ఒప్పందాన్ని కాంగ్రెస్ అధికారంలోకొస్తే పునఃపరిశీలిస్తుందని ఆపార్టీ శాసనసభాపక్ష ఉపనేత తాటిపర్తి జీవన్‌రెడ్డి స్పష్టంచేశారు. మేడిగడ్డ, తుమ్మిడిహెట్టి, చనాకకొరాట ప్రాజెక్టుల నిర్మాణంపై మహారాష్టత్రో చేసుకుంటున్న ఒప్పందాలను నిరసిస్తూ కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట ఆపార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళనలో ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. ఈసందర్భంగా మాట్లాడుతూ, ఉమ్మడి రాష్ట్రంలోని పాలనే స్వరాష్ట్రంలో కొనసాగుతోందని, ప్రాజెక్టుల రిడిజైనింగ్‌తో పాత వాటికి మంగళం పాడి, కొత్తప్రాజెక్టుల నిర్మాణంపేర లక్షల కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసేందుకు ముఖ్యమంత్రి కెసి ఆర్ కుట్రపన్నారని దుయ్యబట్టారు. ఉమ్మడిరాష్ట్రంలో 152మీటర్ల ఎత్తుతో ప్రాణహితచేవెళ్ళ నిర్మించేందుకు అప్పటి ప్రభుత్వం రంగం సిద్దంచేస్తే, తాజాగా 148మీటర్ల ఎత్తుకు కుదించి ఒప్పందం చేసుకోవటం వెనుక ఆంతర్యమేంటో బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. తమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు నిర్మాణం చేపడితే వంద కిమీలకు పైగా ఎలాంటి ఎత్తిపోతలు లేకుండానే నీటిని తెలంగాణ జిల్లాలకు తరలించవచ్చన్నారు. రాష్ట్రాన్ని అప్పులపాలు చేసేందుకే మేడిగడ్డవద్ద ప్రాజెక్టు నిర్మాణానికి భూమిపూజ చేశాడని దుమ్మెత్తిపోశారు. తెలంగాణను పచ్చని రాష్ట్రంగా మారుస్తానన్న సి ఎం కెసి ఆర్ వ్యవసాయాన్ని దయనీయస్థితికి చేర్చాడని ఆవేదన వ్యక్తంచేశారు. కేంద్రం నిధులతో సోకులకు పోతున్న ముఖ్యమంత్రి వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకున్న వారికి ఇప్పటికీ బిల్లులు చెల్లించలేదని, మధ్యాహ్న భోజన కార్మికుల బిల్లులు కూడా పెండింగ్‌లో ఉన్నాయని, రాష్ట్రానికి విడుదలైన ఇన్‌పుట్ సబ్సీడీని కూడా ఇప్పటివరకు ప్రభుత్వ ఖాతాలోవేయటంలో వైఫల్యం చెందాడన్నారు. కాంగ్రెస్ హాయాంలో చేపట్టిన ప్రాజెక్టులను పూర్తిచేయకుండా, గోదావరిలోని అదనపు నీటిని సముద్రపు పాలు చేశాడని దుయ్యబట్టారు.

కరీంనగర్ జిల్లా కేంద్రంలో
కాంగ్రెస్ నేతల నిరసన ప్రదర్శనలు