తెలంగాణ

‘మహా’ ఒప్పందంపై ఎవరేమన్నారంటే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్‌తో, తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు కుదుర్చుకున్న ఒప్పందంపై భిన్నాభిప్రాయాలు వెలువడ్డాయి. పాలక, ప్రతిపక్షాల నేతలు ఈ విధంగా స్పందించారు.
ఇది కెసిఆర్ రచించిన మరో చరిత్ర
అంతర్ రాష్ట్ర వివాదాల నడుమ నాలుగు దశాబ్దాలుగా నలుగుతున్న మూడు ప్రాజెక్టులకు ఒకే రోజు ఒప్పందం జరగడం చారిత్రాత్మకం. ఇలాంటి చారిత్రక ఘట్టంలో భాగస్వామి అయినందుకు నా జన్మ ధన్యమైంది.
- భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి. హరీశ్‌రావు
దేశానికే ఆదర్శం
మహారాష్ట్ర తెలంగాణ రాష్ట్రాల మధ్య జరిగిన ఈ ఒప్పందం దేశానికే ఆదర్శం . తెలంగాణ ఉద్యమానికి ముఖ్యమంత్రి కెసిఆర్ సార్థకత చేకూర్చారు. మహా ఒప్పందంపై కాంగ్రెస్ ఆందోళన చేయడం వారి దివాళాకోరు తనానికి నిదర్శనం .
-వైద్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి
నెరవేరిన ఆదిలాబాద్ జిల్లా కల
జిల్లా వాసుల దశాబ్దాల కల మహా ఒప్పందంతో నెరవేరినట్టు అయింది. ఈ ఒప్పందంతో ఆటంకాలన్నీ తొలగిపోయాయి. 2019 నాటికి రైతులకు సాగునీరు అందుతుంది. బ్యారేజీ పనులు ఇప్పటికే పూర్తయినా భారీ వర్షాల వల్ల పనులకు ఆటంకం ఏర్పడింది.
-మంత్రి జోగు రామన్న
సూర్యాపేటకు వరం
గోదావరిపై ప్రాజెక్టుల నిర్మాణానికి మహారాష్టత్రో కుదిరిన ఒప్పందం వల్ల సూర్యాపేట రైతుల కల నెరవేరుతుంది. దేని కోసం తెలంగాణ ఉద్యమం సాగించారో ఆ కల నెరవేర్చే విధంగా ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారు. కోటి ఎకరాలకు సాగునీటిని అందించేందుకు ప్రయత్నిస్తున్నారు.
-విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి
చీకటి ఒప్పందం
గోదావరి జలాల పంపకాల విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వంతో, తెలంగాణ ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందం చారిత్రాత్మకం ఎలా అవుతుంది?, తెలంగాణ రాష్ట్ర సర్వ హక్కులు మహారాష్టక్రు తాకట్టు పెట్టడమే అవుతుంది. తెలంగాణ ప్రజలకు వాస్తవాలు ఎందుకు చెప్పడం లేదు. ఇది చీకటి ఒప్పందం.
-టిడిపి నేత రావుల
తెలంగాణకు శాశ్వత ద్రోహం
మహారాష్టత్రో తెలంగాణ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం చారిత్రాత్మకం కాదు, ఇది తెలంగాణకు శాశ్వత ద్రోహం అవుతుంది. పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేస్తే కాంగ్రెస్‌కు పేరు వస్తుందనే భయంతోనే వాటిని పక్కన పెట్టి రీ-డిజైన్ పేరిట కుట్రలు చేస్తున్నారు.
-టి.పిసిసి చీఫ్ ఉత్తమ్
చారిత్రక ద్రోహం
ఇది చారిత్రక ఒప్పందం కాదు, చారిత్రక ద్రోహం. బంగారు తెలంగాణ చేస్తామని అధికారంలోకి వచ్చిన టిఆర్‌ఎస్ తెలంగాణను భ్రష్టు పట్టిస్తున్నది.
-సిఎల్‌పి నేత జానారెడ్డి
నిజంగా చారిత్రాత్మకమే
ఇది నిజంగా చారిత్రాత్మక ఒప్పందమే. ఈ ఒప్పందం తెలంగాణ రాష్ట్రానికి చాలా ఉపయోగపడుతుంది. ముఖ్యమంత్రి కెసిఆర్ మార్చిలో అసెంబ్లీ సమావేశాల సమయంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు చెప్పిన హామీలనూ నిలబెట్టుకోవాలి.
-బిజెపి ఎమ్మెల్యే ఎన్విఎస్‌ఎస్ ప్రభాకర్