తెలంగాణ

34డయాలసిస్ కేంద్రాల ఏర్పాటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 24: తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 34 డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేసి మూత్రపిండాల వ్యాధిగ్రస్తులకు సేవలు అందిస్తామని రాష్ట్ర వైద్య శాఖ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి తెలిపారు. భౌగోళికంగా 30 నుంచి 35 చ.కిమీ వైశాల్యంలో డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు. టెండర్ల ప్రక్రియను పూర్తి చేయనున్నట్లు చెప్పారు. కిడ్నీ రోగుల గణాంకాల ఆధారంగా ఈ ఎంపిక జరిగిందన్నారు. ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల, నిర్మల్ ఏరియా హాస్పిటల్స్, ఆదిలాబాద్ రిమ్స్, ఉట్నూరు కమ్యూనిటీ హెల్త్ సెంటర్, కరీంనగర్ జిల్లా సిరిసిల్ల, జగిత్యాల, కరీంనగర్, గోదావరిఖని ఏరియా హాస్పిటల్స్, మెదక్ జిల్లాలో సిద్ధిపేట, జహీరాబాద్, మెదక్ ఏరియా ఆసుపత్రి, సంగారెడ్డి జిల్లా ఆసుపత్రి, వరంగల్ జిల్లా నర్సంపేట, ఏటూరు నాగారం, వరంగల్ ఏరియా ఆసుపత్రి జనగామ, మహబూబాబాద్, ఖమ్మం జిల్లాలో సత్తుపల్లి, కొత్తగూడెం, భద్రాచలం ఏరియా ఆసుపత్రి, నల్లగొండ జిల్లా మిర్యాలగూడ, హూజూర్‌నగర్, సూర్యాపేట ఏరియా ఆసుపత్రి, రంగారెడ్డి జిల్లా వికారాబాద్, మహేశ్వరం సామాజిక ఆరోగ్య కేంద్రం, వనస్థలిపురం ఏరియా హాస్పిటల్స్, తాండూరు జిల్లా ఆసుపత్రి, హైదరాబాద్ జిల్లా మలక్‌పేట ఏరియా ఆసుపత్రి, నిజామాబాద్ జిల్లా కామారెడ్డి, బాన్స్‌వాడ, బోధన్, ఏరియా ఆసుపత్రి, మహబూబ్‌నగర్ జిల్లా గద్వాల, నాగర్‌కర్నూల్, వనపర్తి ఏరియా ఆసుపత్రిలో డయాలిసిస్ కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు.
ఒకేచోట వైద్య పరీక్షలు, వసతుల కల్పన, ఆధునిక పరికరాలు, ఫర్నీచర్‌ను సమకూరుస్తామన్నారు. క్యాన్సర్, కిడ్నీ సంబంధ రోగుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని వరంగల్, ఆదిలాబాద్, ఖమ్మం ఆసుపత్రుల్లో క్యాన్సర్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. కిడ్నీ చెడిపోవడం, మార్పిడి తప్పనిసరి అయిన పరిస్థితుల్లో కిడ్నీ దాతలు దొరకనివాళ్లు డయాలసిస్ మీద మాత్రమే బతుకుతున్నారన్నారు. వీరికి మెరుగైన వైద్య సదుపాయం అందించేందుకు ప్రభుత్వం డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.