తెలంగాణ

తెలుగును బతికించుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, ఆగస్టు 25: భాషపై విద్యాపరమైన విధానాన్ని తయారు చేయాలని, అందుకు తెలుగు ప్రజలంతా ప్రపంచంలో ఎక్కడున్నా తెలుగుభాషను రక్షించుకోవడానికి నడుం బిగించాలని తెలుగు భాషా పరిరక్షణ రాష్ట్ర కన్వీనర్ కొండల్‌రావు పిలుపునిచ్చారు. తెలుగుభాషా విధానంపై మహబూబ్‌నగర్‌లో గురువారం నిర్వహించిన చర్చగోష్టి కార్యక్రమానికి రాష్ట్ర నలుమూలల నుండి తెలుగుభాషా పండితులతో పాటు వివిధ యూనివర్సిటీల ప్రొఫెసర్లు, ఆచార్యులు హాజరయ్యారు. ఈ సదస్సు పొట్టిశ్రీరాములు మాజీ ఉపకులపతి ఆచార్య శివారెడ్డి అధ్యక్షతన కొనసాగింది. ఈ సందర్భంగా కొండల్‌రావు మాట్లాడుతూ మనకు తెలుగు భాషా విధానం ఉందా అనే ప్రశ్న ఉంటే అసలు అమలులో ఉందా అనేది ఇంకో ప్రశ్న అన్నారు. ఈ రెండింటికీ సమన్వయం ఉందా అన్నది మరో ప్రశ్న అన్నారు. పాలన భాషగా ఒక భాషను చేసినప్పుడు తదనుగుణంగా భాషపై విద్యాపరమైన విధానాన్ని తయారు చేయాలన్నారు. అన్ని భాషలు నేర్చుకోవడంలో తప్పులేదని, మాతృభాషను విస్మరించడమంటేనే జాతికి ద్రోహం చేసినట్లు అన్నారు. అందుకే విశ్వనాథ విష్ణుశర్మ ఇంగ్లీష్ చదువులనే నాటకాన్ని రాశారని గుర్తుచేశారు. సదస్సుకు అధ్యక్షత వహించిన ఆచార్య శివారెడ్డి మాట్లాడుతూ పాలమూరు జిల్లా సంస్థానాల జిల్లా అని కొనియాడారు. మాతృభాష రోజురోజుకూ కనుమరుగుకావడం ప్రమాదమన్నారు. ఆచార్య ఎస్వీ రామారావు మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నీలం సంజీవరెడ్డి నుండి కిరణ్‌కుమార్‌రెడ్డి వరకు ఎవరికీ మాతృభాషపై అభిమానం లేదని ఆయన వ్యాఖ్యానించారు. ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ తాను ఓసారి మాతృభాషపైనే ముఖ్యమంత్రితో దాదాపు గంటసేపు చర్చించామని, అందులో ఎన్నో అంశాలు మాట్లాడామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆచార్య యాదగిరి, ఆచార్య జయంతి, ఆచార్య కనకదుర్గ, ఆచార్య మద్దియాదిరెడ్డి, ఆచార్య తిరుపతిరెడ్డి, ఆచార్య శ్రీనాథచారితో పాటు వందలాది మంది పాల్గొన్నారు.

చిత్రం..కొల్లాపూర్ సాహితి వైభవం పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న కొండల్‌రావు, శివారెడ్డి, జాయింట్ కలెక్టర్ రాంకిషన్, ప్రొ. హరగోపాల్ తదితరులు