తెలంగాణ

సిఎం దత్తత గ్రామాల్లో గంగాదేవిపల్లి వాసుల పర్యటన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగదేవ్‌పూర్, ఆగస్టు 25: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు దత్తత గ్రామాలైన ఎర్రవల్లి, నర్సన్నపేటలో వరంగల్ జిల్లాకు చెందిన గంగాదేవిపల్లి గ్రామ ప్రజాప్రతినిధులతో పాటు పలువురు గ్రామస్థులు గురువారం పర్యటించారు. వారు గ్రామానికి చేరుకుని ఇక్కడ అమలవుతున్న పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. ముఖ్యంగా డబుల్‌బెడ్రూంల నిర్మాణం, సామూహిక వ్యవసాయం, చెక్‌డ్యాంల నిర్మాణం, చెరువుల అభివృద్ధి, సోలార్‌లైట్ల వినియోగం, విడిసి కమిటీల పనితీరును చూసి సంతృప్తిని వ్యక్తం జేశారు. ఆలాగే సిఎం ఫాంహౌస్‌లో సాగు చేస్తున్న బొప్పాయి తోటతో పాటు పలు పంటలను వారు పరిశీలించారు. గ్రామంలో పనులను స్థానిక సర్పంచ్ భాగ్యబాల్‌రాజు వారికి వివరించారు.