ఆంధ్రప్రదేశ్‌

త్వరితగతిన తరలింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, ఆగస్టు 26: ఆంధ్రప్రదేశ్ సచివాలయానికి మంత్రులు, ఉద్యోగులు తరలివస్తున్నారు. శుక్రవారం అటవీ, వైద్య, ఆరోగ్య శాఖ విభాగాలు ప్రారంభమయ్యాయి. అటవీ శాఖ కార్యాలయాన్ని, పేషీని మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ఉదయం 8.30 గంటలకు ప్రారంభించగా వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ తన చాంబర్‌ను వేదమంత్రోచ్ఛారణల మధ్య లాంఛనంగా ప్రారంభించారు. మంత్రులు, ఆయా శాఖల కార్యదర్శులు, ఉన్నతాధికారులతో పాటు రెండు శాఖలకు చెందిన సుమారు 200 మందికి పైగా ఉద్యోగులు ప్రత్యేక బస్సులు, వాహనాలలో వెలగపూడికి తరలివచ్చారు. ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, సహచర మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, రావెల కిషోర్‌బాబు, పలువురు ఎమ్మెల్యేలు ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు. మంగళగిరి ఏపిఎస్పీ బెటాలియన్ ఆవరణలో రాష్ట్ర పోలీసు డైరెక్టర్ జనరల్ కార్యాలయాన్ని ఉప ముఖ్యమంత్రి నిమ్మకాలయ చినరాజప్ప ప్రారంభించారు. సుమారు లక్ష చదరపు అడుగులలో రూ.20 కోట్ల ప్రాథమిక అంచనాతో డిజిపి కార్యాలయాన్ని నిర్మించనున్నారు. జనవరిలోగా కార్యాలయ భవనాలు పూర్తికాగలవని హోంమంత్రి చినరాజప్ప, డిజిపి నండూరి సాంబశివరావు వెలగపూడిలో మీడియాకు వివరించారు. కాగా సచివాలయం ఎల్ అండ్ టి సంస్థ నిర్మిస్తున్న నాలుగో బ్లాక్ మొదటి అంతస్తులో అటవీశాఖ, ఐదవ బ్లాక్ గ్రౌండ్ ఫ్లోర్‌లో వైద్య, ఆరోగ్యశాఖ విభాగాలు ఏర్పాటయ్యాయి. వచ్చే నెల నుంచి రాజధానికి అన్ని కీలక శాఖలు తరలిస్తామని, ఇక్కడి నుంచే పాలనా వ్యవస్థ లావాదేవీలు జరుగుతాయని మంత్రులు తెలిపారు. ప్రజలకు మరింత మెరుగైన పారదర్శక పాలన అందించాలనే లక్ష్యంతో శరవేగంతో కార్యాలయాలను తరలిస్తున్నట్లు చెప్పారు. సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మురళీకృష్ణ మాట్లాడుతూ ప్రభుత్వ సంకల్పంలో ఉద్యోగులు భాగస్వాములవుతున్నారని, ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ప్రభుత్వం బాధ్యత వహిస్తోందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశాల ప్రకారం శాఖల తరలింపు ప్రక్రియ పూర్తికావచ్చిందన్నారు. సచివాలయంలో చిన్నచిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ వౌలిక వసతులపై ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. ఈ ఏడాదికి ప్రభుత్వం వెసులుబాటు కల్పించినందున విధుల నిర్వహణలో తమకెలాంటి అవరోధాలు ఉండవని సచివాలయ ఉద్యోగులు స్పష్టం చేశారు. తాత్కాలిక సచివాలయ భవనాల నిర్మాణం సంతృప్తికరంగా ఉందన్నారు. నర్సాపురం ఎంపీ గోకరాజు గంగరాజు, కృష్ణాజిల్లా జెడ్పీ చైర్‌పర్సన్ గద్దె అనూరాధ, విజయవాడ నగర పోలీసు కమిషనర్ గౌతం సవాంగ్, ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్ తదితరులు కార్యక్రమానికి హాజరయ్యారు.
chitram....

ఆరోగ్యశాఖ కార్యాలయాన్ని
ప్రారంభిస్తున్న మంత్రి కామినేని