తెలంగాణ

30న అసెంబ్లీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 26: ఈనెల 30న శాసన సభ, శాసన మండలి సమావేశమవుతుంది. జిఎస్‌టి బిల్లు ఆమోదం కోసం ప్రత్యేక సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. క్యాంపు కార్యాలయంలో శుక్రవారం అసెంబ్లీ వ్యవహారాల మంత్రి తన్నీరు హరీశ్‌రావు, అసెంబ్లీ కార్యదర్శి రాజా సదారం, అడ్వకేట్ జనరల్ రామకృష్ణారెడ్డి, న్యాయశాఖ కార్యదర్శి సంతోష్‌రెడ్డి తదితరులతో సిఎం కెసిఆర్ సమావేశమయ్యారు. రాజ్యాంగాన్ని సవరిస్తూ ఇటీవల పార్లమెంటు జిఎస్‌టి చట్టం తెచ్చింది. చట్టం అమల్లోకి రావడానికి దేశంలోని సగం రాష్ట్రాలు ఆమోదించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో జిఎస్‌టి బిల్లుపై చర్చించడానికి ఈనెల 30న ఉదయం 11 గంటలకు సభలను సమావేశ పరచాలని స్పీకర్ మధుసూధనాచారి, మండలి చైర్మన్ స్వామిగౌడ్‌ను సిఎం కెసిఆర్ కోరారు. రాజ్యాంగ సవరణకు సంబంధించిన బిల్లు కాబట్టి సభ్యులకు పూర్తి వివరణ ఇవ్వడానికి అడ్వకేట్ జనరల్ రామకృష్ణారెడ్డిని శాసన సభ సమావేశానికి ప్రత్యేక ఆహ్వానితునిగా పిలవాలని సూచించారు. జిఎస్‌టి బిల్లు ఆమోదానికే ప్రత్యేక సమావేశం నిర్వహించినా, దానిని వర్షాకాల సమావేశాలుగా నిర్వహించనున్నట్టు చెప్పారు. 30న సమావేశం జరుగుతుందని సిఎంవో పేర్కొంది. అయితే ఎన్ని రోజులు సమావేశాలు నిర్వహించాలనేది 30న జరిగే బిఏసిలో నిర్ణయిస్తారు.