తెలంగాణ

1975లోనే ఒప్పందం జరిగితే ఇప్పటివరకు ఏం చేశారు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 26:వెంగళరావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే గోదావరిపై ప్రాజెక్టుల నిర్మాణానికి నిర్ణయం జరిగింది అని చెబుతున్న కాంగ్రెస్ నాయకులు ఇంత కాలం ప్రాజెక్టులు నిర్మించకుండా ఏం చేశారని టిఆర్‌ఎస్ ఎమ్మెల్సీ భానుప్రసాద్ ప్రశ్నించారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టులు నిర్మించడాన్ని, మహారాష్టత్రో ఒప్పందం కుదుర్చుకోవడాన్ని కాంగ్రెస్ నాయకులు జీర్ణం చేసుకోలేకపోతున్నారని విమర్శించారు. వెంగళరావు హయాంలోనే ప్రాణహిత కోసం ఒప్పందం చేసుకుంటే ఇంతకాలం ఏం చేసినట్టు అని ప్రశ్నించారు. ఒప్పందాలకు, ప్రతిపాదనలకు సైతం కాంగ్రెస్ నాయకులకు తేడా తెలియడం లేదని అన్నారు. అవగాహన లేని కాంగ్రెస్ నాయకులు ఇంత కాలం రాష్ట్రాన్ని పాలించారని ఎద్దేవా చేశారు. తప్పుడు ఆరోపణలతో కాలం గడుపుతున్న కాంగ్రెస్ నాయకులపై కేసులు అవసరం లేదని, ఎర్రగడ్డ పిచ్చాసుపత్రిలో చేర్చాల్సిన అవసరం లేదని అన్నారు. ప్రజలే తగిన బుద్ధి చెప్పారని అన్నారు. కాంగ్రెస్, టిడిపి నేతలు ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని అన్నారు. ప్రాజెక్టుల ఒప్పందాలు, డిజైన్‌లలో ఏమైనా తప్పులు ఉన్నాయని అనుకుంటే ఎత్తి చూపవచ్చునని, ప్రభుత్వం సలహాలను స్వీకరిస్తుందని, కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే సహించేది లేదని అన్నారు.