తెలంగాణ

అసెంబ్లీని 15రోజులు నిర్వహించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 29: జిఎస్‌టి బిల్లు కోసం మంగళవారం ఒక్క రోజు మాత్రమే శాసన సభ సమావేశాన్ని నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తుండగా, ప్రజల సమస్యలు చర్చించేందుకు సభను 15 రోజుల పాటు సభ నిర్వహించే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు రావాలని సోమవారం జరిగిన సిఎల్‌పి సమావేశంలో నిర్ణయించారు. సిఎల్‌పి నాయకుడు కె జానారెడ్డి నాయకత్వంలో శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులు, పార్లమెంటు సభ్యుల సమావేశం జరిగింది. మొత్తం 18 మంది ఈ సమావేశానికి హాజరయ్యారు. నలుగురు శాసన సభ్యులు హాజరు కాలేదు.
కాళేశ్వరం ప్రాజెక్టుకు సబంధించి మహారాష్టత్రో ఒప్పందం జరిగిందని కాంగ్రెస్ నాయకులు వాదిస్తుంటే ఒప్పందం జరగలేదు అని సిఎల్‌పి నాయకుడిగా మీరు ప్రకటించడం వల్ల తప్పుడు సంకేతాలు వెళ్లాయని కొందరు సభ్యులు సమావేశంలో అన్నట్టు తెలిసింది. తన మాటలను కొన్ని పత్రికలు మరో రకంగా రాశాయని, తాను నిజాలే మాట్లాడానని జానారెడ్డి తెలిపారు. ప్రతిపాదనలు పెట్టాం కానీ ఒప్పందాలు జరగలేదు అనే విషయాన్ని చెప్పానని అన్నారు. ఎవరెవరో ఏదో ప్రచారం చేస్తున్నారు తాను వాస్తవాలే మాట్లాడుతున్నానని అన్నారు.
పార్టీ మొత్తం ఒకే మాట మీద ఉండాలని సమావేశంలో అభిప్రాయం వ్యక్తం అయింది.
రాష్ట్రాన్ని కుదిపి వేసిన నరుూం ఉదంతంపై సమావేశంలో చర్చించారు. సిట్ విచారణ సరిపోతుందని కొందరు సభ్యులు అభిప్రాయం వ్యక్తం చేయగా, కొందరు సిబిఐ విచారణ మేలని అన్నారు. వేలాది ఎకరాల భూములను స్వాహా చేయడం, పెద్ద మొత్తంలో డబ్బులు, అమ్మాయిలను హత మార్చడం వంటి ఎన్నో నేరాలు ఇందులో ఇమిడి ఉండడం వంటి కారణాలతో సిబిఐ విచారణ కోరాలని నిర్ణయించారు. మహారాష్టత్రో జరిగిన ఒప్పందంతో పాటు రాష్ట్రంలో నెలకొన్న కరవు పరిస్థితి, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం వంటి మొత్తం 18 అంశాలను గుర్తించారు. వీటిపై చర్చించే విధంగా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించడం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు రావాలని నిర్ణయించారు. కొత్త జిల్లాల ఏర్పాటు అంశంపై జిల్లాల్లో జరుగుతున్న ఉద్యమాలను సభలో బలంగా వినిపించాలని నిర్ణయించారు.
జిఎస్‌టి బిల్లుకు ఎలాంటి అభ్యంతరాలు లేకుండా ఆమోదం తెలపాలని నిర్ణయించారు. పార్లమెంటులో కాంగ్రెస్ పార్టీ జిఎస్‌టికి మద్దతు ఇచ్చినందున అదే విధంగా రాష్ట్రంలో మద్దతు ఇవ్వాలని నిర్ణయించారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి,జానారెడ్డి, భట్టి విక్రమార్క,డికె అరుణ, షబ్బీర్ అలీ,రాజ్యసభ సభ్యులు రాపోలు ఆనంద భాస్కర్, ఎంఎ ఖాన్ రాష్ట్రంలో నెలకొన్న పలు సమస్యలపై సభలో ప్రస్తావించాలని చెప్పారు. శాసన సభ్యులు గీతారెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పద్మావతి రెడ్డి, దొంతి మాధవరెడ్డి సమావేశానికి హాజరు కాలేదు.
నరుూం డైరీని బయటపెట్టాలి
నరుూం డైరీలోని పేర్లను బహిర్గతం చేయాలని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు రావాలని సిఎల్‌పి సమావేశం డిమాండ్ చేసింది. సిఎల్‌పి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను కాంగ్రెస్ విప్ సంపత్ మీడియాకు వివరించారు. ఎమ్మెల్యేలు పార్టీ మారిన అంశంపై ఫిర్యాదు చేసినా ఇంత వరకు చర్య తీసుకోలేదని, తక్షణం నిర్ణయం తీసుకోవాలని సభలో ఒత్తిడి తీసుకు రావాలని సూచించారు. మెట్రో రైలు నిర్మాణంలో ఆలస్యానికి ప్రభుత్వాన్ని నిలదీయాలని అన్నారు. ప్రతి చెట్టుకు పుట్టకు గులాబీ రంగు వేస్తున్నారని దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు చెప్పారు. పెండింగ్ ప్రాజెక్టులపైన, మహా రాష్ట్ర ఒప్పందంపైన విస్తృతంగా చర్చించాలని ప్రభుత్వాన్ని కోరనున్నారు. ప్రాజెక్టుల రీ డిజైనింగ్‌తో పాటు అన్ని అంశాలపై చర్చించే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు వస్తామని చెప్పారు.

చిత్రం.. సోమవారం హైదరాబాద్‌లో జరిగిన సిఎల్పీ సమావేశంలో పాల్గొన్న
షబ్బీర్ అలీ, జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మల్లు భట్టివిక్రమార్క