తెలంగాణ

పులిచింతల విద్యుత్ ఉత్పత్తి పనులకు ట్రయల్న్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేళ్లచెర్వు, ఆగస్టు 29: నల్లగొండ జిల్లా మేళ్లచెర్వు మండల పరిధిలోని తెలంగాణ జెన్‌కో విద్యుత్ సంస్థకు చెందిన పులిచింతల జల విద్యుత్ ఉత్పత్తి మొదటి యూనిట్ పనులను సోమవారం జెన్‌కో హైడల్ డైరెక్టర్ వెంకట్‌రాజన్ ట్రయల్న్ నిర్వహించారు. పులిచింతల జలవిద్యుత్ కేంద్రం ఉత్పత్తి సామర్ధ్యం 120 మెగావాట్లు కాగా మొదటి యూనిట్ కింద 30 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అధికారులు రంగం సిద్ధం చేశారు. ఈ నేపథ్యంలో విద్యుత్ ఉత్పత్తి మినహా మొదటి యూనిట్‌లోని అన్ని సాంకేతిక విభాగాల పనితీరును మోకానికల్ స్పిండింగ్ ద్వారా పరిశీలించారు. ఈ సందర్భంగా వెంకట్‌రాజన్ విలేఖరులతో మాట్లాడుతూ ఈనెల చివరిలోగా 30 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తామని, మిగతా 90 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ప్రక్రియను ఈ ఏడాది చివరిలోగా పూర్తి చేస్తామన్నారు. ఉత్పత్తయిన విద్యుత్ గ్రిడ్‌కు సరఫరా అయి అక్కడి నుండి ప్రాంతాలకు విద్యుత్ సరఫరా అవుతుందని తెలిపారు. ఈ ప్రాజెక్టు వల్ల పరిసర ప్రాంతాలకు లోవోల్టేజీ సమస్య ఉండదన్నారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ సౌధ అధికారులు టిఎస్‌ఎన్ మూర్తి, శివాజీరావు, దివాకర్, వెంకటేశ్వరవర్మ, కుమార్, శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

చిత్రం.. ట్రయల్న్‌న్రు ప్రారంభిస్తున్న జెన్‌కో హైడల్ డైరెక్టర్