తెలంగాణ

అదే జోరు.. ఆగని పోరు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్/వరంగల్/ఆదిలాబాద్/మహబూబ్‌నగర్, ఆగస్టు 29: జిల్లాల పునర్విభజనపై ప్రభుత్వం విడుదల చేసిన ముసాయిదాపై ఎప్పటిలాగే నిరసనలు హోరెత్తుతున్నాయి. ప్రత్యేక జిల్లా కోసం కరీంనగర్ జిల్లాలోని సిరిసిల్ల, రెవెన్యూ డివిజన్ కోసం కోరుట్ల, కరీంనగర్ జిల్లాలోనే ఉంచాలంటూ హుస్నాబాద్, కోహెడ, ఇల్లంతకుంట మండలాల్లో సోమవారం ఆందోళనలు కొనసాగాయి. కోరుట్లను రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ రెవెన్యూ డివిజన్ సాధన కమిటీ జెఏసి ఆధ్వర్యంలో చేపట్టిన రిలే దీక్షలు సోమవారం నాటికి ఏడవ రోజుకు చేరగా, ఆందోళన చేపట్టారు. కోరుట్ల మున్సిపల్ అత్యవసర సమావేశం సోమవారం జరగాల్సి ఉండగా, ఆందోళనల నేపథ్యంలో సమావేశాన్ని వాయిదా వేశారు. సమావేశంలో రెవెన్యూ డివిజన్‌గా మార్చాలని తీర్మానం చేయాల్సి ఉండగా, సమావేశాన్ని వాయిదా వేయడం పట్ల బిజెపి కౌన్సిలర్ ఇందూర్ సత్యం గుండు గీయించుకుని నిరసన తెలిపారు. హుస్నాబాద్, కోహెడ మండలాలను కరీంనగర్ జిల్లాలోనే కొనసాగించాలని హుస్నాబాద్‌లో రిలే దీక్షలు, కోహెడ మండల కేంద్రాల్లో జాప మల్లారెడ్డి చేపట్టిన అమరణ దీక్ష కొనసాగాయి. కరీంనగర్ జిల్లాలోనే కొనసాగించాలంటూ ఇల్లంతకుంటలో ఆఖిలపక్షం నేతలు ఆందోళనకు దిగారు. సిఎం కెసిఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. సిరిసిల్ల జిల్లాను చేయాలని డిమాండ్ చేస్తూ తెరాస నాయకులు రిలే దీక్షలను ప్రారంభించారు. న్యాయవాదుల రిలే దీక్షలు కొనసాగుతూనే ఉన్నాయి.
వరంగల్‌లో హన్మకొండ జిల్లా ప్రతిపాదనను తక్షణమే విరమించుకోవాలని కోరుతూ సోమవారం అన్ని రాజకీయ పార్టీల నాయకులు సమావేశమై మంగళవారం జరిగే బంద్‌పై చర్చించారు. ఈ సమావేశంలో పొలిటికల్ జెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ పాల్గొని సంఘీభావం ప్రకటించారు. అదేవిధంగా జనగామ జిల్లా చేయాలని అడ్వకేట్స్ చేపట్టిన రిలే దీక్షలను ప్రొఫెసర్ కోదండరామ్ ప్రారంభించారు. మరోవైపు జనగామ జిల్లా చేయాలని కోరుతూ లింగాలఘణపురం మండలం నెల్లుట్లలో మహిళలు పెద్దఎత్తున ర్యాలీ నిర్వహించగా ఈ ర్యాలీకి కూడా కోదండరామ్ సంఘీభావం ప్రకటించారు. కాగా, జిల్లా బంద్ విజయవంతం చేయాలని కోరుతూ బిజెపి నాయకులు జనగామలో ర్యాలీ నిర్వహించారు.
జిల్లాల విభజన పేరిట ముఖ్యమంత్రి కెసిఆర్ వెనకబడిన ప్రాంతాలకు తీరని అన్యాయం చేస్తున్నారని, నిర్మల్ జిల్లా ప్రతిపాదనను విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఆదిలాబాద్ జిల్లా పరిరక్షణ సమితి అధ్వర్యంలో అందోళన ఉధృతం చేశారు. ఆదిలాబాద్‌లో 200 మంది మోటారు సైకిళ్లతో భారీ ర్యాలీ నిర్వహించి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విభజనకు ఆదిలాబాద్, మంచిర్యాల జిల్లాలు సహేతుకంగా ఉంటాయని, నిర్మల్ జిల్లాను తక్షణమే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్‌కు వినతి పత్రం సమర్పించారు.
మరోవైపు మహబూబ్‌నగర్ జిల్లాలో గద్వాల జిల్లా పంచాయతీ ముదిరింది. వరుసగా మూడు రోజుల పాటు బంద్ నిర్వహించినప్పటికీ అఖిల పక్ష నేతలు తమ ఆందోళనలు విరమించలేదు. సోమవారం గద్వాలలో అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆటోయూనియన్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీని నిర్వహించారు. అనంతరం నోటికి నల్లగుడ్డలు కట్టుకుని ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. ధర్నా చౌక్‌లో ధర్నా నిర్వహించిన ఆటోవాలాలు గద్వాల జిల్లా చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా కల్వకుర్తిని డివిజన్‌గా ఏర్పాటు చేయాలని కోరుతూ గత రెండు నెలల నుండి కొనసాగుతున్న నిరసనలు మరింత ఉధృతమయ్యాయి. ఇక్కడ అన్ని రాజకీయ పార్టీల నాయకులు రాజకీయాలకు అతీతంగా దీక్షలకు దిగి తమ ఆందోళనను జిల్లా కేంద్రానికి తీసుకెళ్లారు. సోమవారం కాంగ్రెస్ ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు జైపాల్‌యాదర్, ఎడ్మా కిష్ణారెడ్డి, బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆచారి, టిడిపి, సిపిఎం, బహుజన సమాజ్ పార్టీ, ప్రజా సంఘాల నేతలు జిల్లా కలెక్టర్ టికె శ్రీదేవిని కలిసి కల్వకుర్తిని డివిజన్ కేంద్రంగా ఏర్పాటు చేయాలని వినతి పత్రాన్ని అందజేశారు.

చిత్రాలు.. జనగామ జిల్లా కోసం ర్యాలీలో పాల్గొన్న జెఎసి చైర్మన్ కోదండరామ్
సిరిసిల్లలో ర్యాలీ నిర్వహిస్తున్న తెరాస నేతలు, కార్యకర్తలు