తెలంగాణ

ఆగని ఆందోళనలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్/ఆదిలాబాద్/వరంగల్, సెప్టెంబర్ 1: కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రభుత్వం జారీచేసిన ముసాయిదాపై జిల్లాల్లో ఆందోళనలు నాన్‌స్టాప్‌గా కొనసాగుతున్నాయి. కరీంనగర్ జిల్లాలో సిరిసిల్లను జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన రిలే దీక్షలు గురువారం కూడా కొనసాగాయి. హైదరాబాద్‌లో జెఏసి నేతల అరెస్ట్‌ను నిరసిస్తూ ఇచ్చిన 48 గంటల బంద్‌లో భాగంగా రెండవ రోజు బంద్ సక్సెస్ అయింది. బస్ డిపో ఎదుట ఆందోళనకారులు బైఠాయించడంతో బస్సులు రోడ్డెక్కలేదు. ఆందోళన చేస్తున్న జెఏసి నాయకులను అరెస్ట్ చేసి, స్టేషన్‌కు తరలించగా, ఆందోళనకారులు స్టేషన్‌ను ముట్టడించారు. ధర్నా చేశారు. దీంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. బిజెవైయం కార్యకర్తలు వాటర్ ట్యాంక్ ఎక్కిన నిరసనలు తెలిపారు. సిరిసిల్లను జిల్లా ఏర్పాటు చేయాలంటూ ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో రాస్తారోకో నిర్వహించారు. ఇదే మండలంలోని వీర్నపల్లిని మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలని చేపట్టిన రిలే దీక్షలు నాలుగవ రోజుకు చేరాయి. హుస్నాబాద్, కోహెడ మండలాలను కరీంనగర్ జిల్లాలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో హుస్నాబాద్‌లో రిలే దీక్షలు కొనసాగాయి. కోహెడను సిద్దిపేటలో విలీనం చేయడాన్ని నిరసిస్తూ మండలంలోని రాంచంద్రాపూర్ గ్రామంలో గ్రామస్తులు, అఖిలపక్షం నేతలు హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్‌కుమార్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.
ప్రభుత్వం ఏకపక్షంగా ఆశాస్ర్తియ పద్ధతిలో ఆదిలాబాద్ జిల్లాను మూడు ముక్కలు చేయడాన్ని నిరసిస్తూ గురువారం ఆదిలాబాద్‌లో నిరసనలు హోరెత్తాయి. రాజకీయ లబ్ధికోసం ప్రజల డిమాండ్ లేకపోయినా నిర్మల్ జిల్లాను తెరపైకి తెచ్చి ఆదిలాబాద్ జిల్లాను వెనకబాటుకు గురిచేశారని ఆరోపిస్తూ మూడవ రోజు రిలే నిరాహార దీక్షలు కొనసాగాయి. గురువారం పోలాల అమావాస్య పండగ నేపథ్యంలో ముస్లిం సంఘాల ప్రతినిధులు నిరసన దీక్షలో పాల్గొని ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు. ఆదిలాబాద్ పరిరక్షణ సమితి అధ్వర్యంలో జిల్లాకు చెందిన మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, జోగురామన్నల ఫ్లెక్సీ దిష్టిబొమ్మలను తెలంగాణ చౌక్‌లో దగ్ధం చేసి తూర్పారబట్టారు.
వరంగల్ జిల్లాలోని జనగామను జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ స్థానిక ఆర్టీసీ చౌరస్తా సమీపంలో ఏర్పాటు చేసిన దీక్షలు 74వ రోజుకు చేరాయి. శాస్ర్తియ పద్ధతిలో జిల్లాల ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అన్ని అర్హతలున్న జనగామను జిల్లాగా ప్రకటించి ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేయాలన్నారు. ములుగును జిల్లాగా, మల్లంపల్లిని మండలంగా ఏర్పాటుచేయాలని కోరుతూ సర్పంచ్ గోల్కొండ రవి అధ్యక్షతన అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో నాయకులు గురువారం మండలంలోని మల్లంపల్లి గ్రామంలోని జాతీయ రహదారిపై ధర్నా, రాస్తారోకో చేపట్టారు.

చిత్రాలు..కరీంనగర్ జిల్లా సిరిసిల్ల పోలీస్ స్టేషన్ ముందు
ఆందోళన చేస్తున్న జెఎసి నాయకులు, ఆందోళనకారులు...
వరంగల్ జిల్లా ములుగులో రాస్తారోకో చేస్తున్న అఖిలపక్ష కమిటీ నాయకులు