తెలంగాణ

వినకుంటే ఉద్యమమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంస్థాన్‌నారాయణపురం, సెప్టెంబర్ 1: తెలంగాణ సాధించుకున్నది గిరిజనుల భూములు లాక్కోవడానికేనా అని జెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. నల్లగొండ జిల్లా సంస్థాన్‌నారారయణపురం మండలం రాచకొండ గుట్టల్లో గురువారం రాచకొండ గిరిజనుల భూగోస అధ్యయన యాత్ర సభను జెఎసి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఇందులో పాల్గొన్న కోదండరాం గిరిజనులతో పాటు, స్థానిక రాజకీయ పార్టీల నాయకులు చెప్పిన వివరాలు తెలుసుకున్నారు. అనంతరం కోదండరాం మాట్లాడుతూ వందల సంవత్సరాలుగా ఇక్కడి భూములను నమ్ముకుని గిరిజనులు, హరిజనులు, బంటు, బెస్త, బోయ, యాదవ కులాలకు చెందిన వందలాది మంది జీవిస్తున్నారని అన్నారు. సమైక్యాంధ్ర పాలకులు తెచ్చిపెట్టిన ఫీల్డ్‌ఫైరింగ్ రేంజ్, బిడిఎల్ వంటి సంస్థలను పోరాడి వెళ్లగొట్టినా ఇక్కడి ప్రజలు తెలంగాణ రాష్ట్రంలో భూములను కోల్పోవలసిన దుస్థితి రావడం హేయమైందన్నారు. వ్యవసాయమే జీవనాధారంగా జీవిస్తున్న గిరిజనులను ప్రభుత్వ, ఫారెస్టు భూములంటూ స్వాధీనం చేసుకోవాలని చూడటం దుర్మార్గమైన చర్యని దుయ్యబట్టారు. భూమిలేని హరిజన, గిరిజనులకు మూడెకరాల భూమి ఇస్తానని హామీలిచ్చిన ప్రభుత్వం ఉన్న భూమినే లాగేసుకోవడం ఎంతవరకు న్యాయమన్నారు. కెసిఆర్ రాచకొండకు వస్తే ఇక్కడ అభివృద్ధి చెందుతుందని సంబరపడ్డారు. అభివృద్ధికి అవసరమైన భూములు చాలా ఉన్నాయనీ, వ్యవసాయం చేసుకునే భూములు లాక్కుంటుంటే చూస్తూ ఊరుకోబోమన్నారు. ముందుగా జిల్లా కలెక్టర్‌కు, అటు తరువాత రాష్ట్ర స్థాయిలో అధికారులకు వివరిస్తామని, అప్పుడు కూడా వినకుంటే తెలంగాణ ఉద్యమంలో నేర్చుకున్న అనేక పోరాటాలు తమకు తెలుసునని సున్నితంగా ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

చిత్రం.. రాచకొండలో మాట్లాడుతున్న జెఎసి చైర్మన్ కోదండరాం