తెలంగాణ

టెక్స్‌టైల్ పార్కు వేదిక మారిందా?!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, సెప్టెంబర్ 1: వరంగల్ జిల్లాలో ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న ఏకైక భారీ పరిశ్రమ టెక్స్‌టైల్ పార్క్ నిర్మాణ వేదిక మారినట్లు తెలిసింది. టెక్స్‌టైల్ పార్క్ నిర్మాణానికి కావాల్సిన భూసేకరణ ప్రభుత్వానికి పెనుసవాల్‌గా మారింది. ముందుగా అనుకున్న ప్రకారం ధర్మసాగర్ మండలం ముప్పారం, దేవునూరు గుట్టల మధ్య ఉన్న దాదాపు 1100 ఎకరాల్లో టెక్స్‌టైల్ పార్క్ నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయని అందరూ భావించినా చివరి క్షణంలో రద్దయనట్లు తెలిసింది. ధర్మసాగర్ మండలం కాకుండా వరంగల్ నగర శివారులోని గీసుకొండ-సంగెం మండలాల మధ్య ఉన్న గ్రామాల్లో టెక్స్‌టైల్ పార్క్ నిర్మాణం చేయాలని తాజాగా సర్కార్ భావించింది. అయితే ఇందుకు స్థల సేకరణ ప్రభుత్వానికి సవాల్‌గా మారింది. ఇప్పటికే మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్మాణ విషయంలో రిజర్వాయర్ నిర్మాణంపై భూసేకరణ విషయంలో ప్రభుత్వానికి రైతుల నుంచి వ్యతిరేకత వస్తోంది. ఈ విషయంలో ప్రతిపక్షాలు కూడా ప్రభుత్వం తీరును పట్టుబట్టాయి. ఇదిలా ఉండగానే వరంగల్‌లో నిర్మించ తలపెట్టిన టెక్స్‌టైల్ పార్క్ నిర్మాణానికి స్థల సేకరణ సవాల్‌గానే మారింది. జిల్లాలో టైక్స్‌టైల్ పార్క్ ఏర్పాటు కోసం అధికారులు ముమ్మరంగా కసరత్తులు చేస్తున్నారు. అందులో భాగంగా దాదాపు మూడు వేల ఎకరాలకు పైగా స్థల సేకరణ కోసం అధికారులు ప్రభుత్వ భూములను జల్లెడ పడుతున్నారు. అయినప్పటికీ ఎక్కడ కూడా ఇంత పెద్ద మొత్తంలో ప్రభుత్వ భూములు లేకపోవడంతో రైతుల భూములపై సర్కారు కన్నుపడింది. తాజాగా రెవెన్యూ అధికారులు గీసుకొండ-సంగెం మండలాల పరిధిలో ఉన్న ఊకల్ శివారు, శాయంపేట హవేలితో పాటు చింతలపల్లి, కృష్ణానగర్, పల్లారుగూడ గ్రామాల్లో రెవెన్యూ అధికారులు గురువారం పర్యటించి రైతుల భూములను సర్వే చేశారు. ఈ విషయాన్ని తెలుసుకున్న రైతులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకొని రెవెన్యూ అధికారులను అడ్డుకున్నారు. కాగా, ముందుగా ధర్మసాగర్ శివారులో టెక్స్‌టైల్ పార్కు ఏర్పాటు ప్రతిపాదన ఊపందుకోవడంతో భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. అకస్మాతుగా టెక్స్‌టైల్ పార్కు వేదిక మారడంతో ముందస్తుగా భూములు కొనుకున్న రియల్టర్లు ఇప్పుడు లబోదిబోమంటున్నారు. అయితే టెక్స్‌టైల్ పార్కు గీసుకొండ-సంగెం మండలాల వైపు వస్తుందని తెలియడంతో ఇక్కడి భూములకు రెక్కలొస్తున్నాయి. అయితే అధికారులు తాజాగా ఇక్కడ చేస్తున్న భూముల సర్వే కొత్తగా ఏర్పాటు కానున్న వరంగల్ జిల్లా కార్యాలయాల కోసమని మరోవైపు చెపుతున్నారు.

చిత్రం.. వరంగల్-గీసుకొండ-సంగెం జాతీయ రహదారిపై రైతుల ఆందోళన